Moviesఎన్టీఆర్ పిలిచి ఆఫ‌ర్ ఇస్తే సినిమా చేయ‌ని స్టార్ డైరెక్ట‌ర్‌...!

ఎన్టీఆర్ పిలిచి ఆఫ‌ర్ ఇస్తే సినిమా చేయ‌ని స్టార్ డైరెక్ట‌ర్‌…!

దివంగత విశ్వవిఖ్యాత నటుడు నటరత్న నందమూరి తారక రామారావు తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లు – నిర్మాతలు – టెక్నీషియన్స్ పనిచేశారు. రామారావు కెరీర్లో ఎక్కువ శాతం సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆయన నటించిన సినిమాలు తక్కువే ప్లాప్‌ అయ్యాయి. ఎన్టీఆర్ హీరో మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత కూడా..! ఆయనకు అన్ని రంగాలపై ఎంతో పట్టు ఉండేది. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే అవకాశం వస్తే చాలు అనుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

అలాంటిది ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం ఎన్టీఆర్ పిలిచి సినిమా చేయమని ఛాన్స్ ఇస్తే కూడా చేయలేదట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సీనియర్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి. కోదండరామిరెడ్డి వరుస హిట్లతో బిజీగా ఉన్న టైంలో ఎన్టీఆర్ నుంచి పిలుపువచ్చింది. అప్పటికే తమిళంలో హిట్టయిన గౌరవం సినిమా తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించాలని అనుకున్నారు. ఒకరోజు కోదండరామిరెడ్డి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లగానే ఎన్టీఆర్ రామిరెడ్డిని తన భార్య బసవతారకంకు పరిచయం చేశార‌ట‌.

రాఘవేంద్రరావు అసిస్టెంట్ … మాతో సినిమా చేస్తున్నారు అని కూడా గొప్పగా చెప్పారట. బ‌స‌వతార‌కం కోదండ‌రామిరెడ్డిని ఎంతో అప్యాయంగా ప‌క‌ల‌రించి ప‌రిచ‌యం చేసుకున్నార‌ట‌. అయితే అప్పటికే కోదండరామిరెడ్డి అడ్వాన్సులు తీసుకున్న‌ నిర్మాతలు ముందు మా సినిమాలు పూర్తిచేశాక ఎన్టీఆర్‌తో చేసుకోమని కండీషన్ పెట్టారట.

దీంతో కోదండరామిరెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమా చేయ‌లేక‌పోయాయ‌న‌ని చెప్పారు. మ‌హానుభావుడు ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయాను అని ఆయన ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణకు మాత్రం కోదండరామిరెడ్డి బ్లాక్ బ‌స్టర్ హిట్లు ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news