Moviesఅద్దిరిపోయే ఫోటోని షేర్ చేసిన ఎన్టీఆర్..చూసి తీరాల్సిందే..!!

అద్దిరిపోయే ఫోటోని షేర్ చేసిన ఎన్టీఆర్..చూసి తీరాల్సిందే..!!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు మూడేళ్లుగా పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాతే తన కొత్త సినిమాల షూటింగ్ మొదలయ్యే విధంగా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరో వైపు జెమినీ ఛానల్ లో తారక్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ కూడా పూర్తి చేసేసారు ఈ యంగ్ హీరో. ఇక వరుస షూటింగ్ పనులతో విసిగిపోయిన తారక్ కొంచెం తిలాక్స్ కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి పారిస్ కు వెకేషన్ కు వెళ్లారు.

మహేష్ బాబు ఫ్యామిలీ మాదిరిగానే ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా రెగ్యులర్ గా విదేశీ ట్రిప్ లు వేస్తారు. కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ సరదాగా ట్రిప్ వేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కరోనా వల్ల గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ విదేశీ ట్రిప్ వేయలేదు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడటంతో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి విదేశీ ట్రిప్ ప్లాన్ చేశారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ కనీసం మూడు నాలుగు వారాల పాటు విదేశీ ట్రిప్ వేసారని టాక్ వినిపిస్తుంది.

తాజాగా ఎన్టీఆర్‌పారిస్‌ లో తన కొడుకు తో కలిసి ఉన్న ఫోటో ని షేర్ చేసారు. ఈ మేరకు ఆయన తన పెద్ద కుమారుడు అభయ్‌రామ్‌తో దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ఈఫిల్‌ టవర్‌ బ్యాక్‌డ్రాప్‌లో కుమారుడికి ప్రేమతో ముద్దు పెడుతున్న పిక్‌ని ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో షోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. తండ్రి ప్రేమను చూపిస్తున్నాడని అభిమానులను కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్న యంగ్‌ టైగర్‌ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరీ 7 న రిలీజ్ కానుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news