Moviesఅక్కడలా జరిగిన మొదటి పుట్టినరోజు అల్లు అర్హ దే..సరికొత్త రికార్డ్..!!

అక్కడలా జరిగిన మొదటి పుట్టినరోజు అల్లు అర్హ దే..సరికొత్త రికార్డ్..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. ఈ పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నాకూడా తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే భార్య ఇద్దరు పిల్లలతో ఆయన సరదాగా గడుపుతుంటారు. ముఖ్యంగా ఆయన ముద్దుల కూతురు అర్హతో కలిసి ఆయన చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తన కూతురితో కలిసి చేసే అల్లరిని ఆయన ఎప్పటికప్పుడు షోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు.

ఇక నిన్న అల్లు అర్హ పుట్టిన రోజు. నవంబర్ 21, 2016న పుట్టిన అర్హ నేడు ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్యూటీ పుట్టిన రోజు సందర్భంగా సినిమా తారలు అర్హ కు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలిపారు. ఇక అల్లు అర్హ పుట్టిన రోజులు వేదుకలను ఘనంగా జరుపుకున్నారు ఫ్యమిలీ. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాపై అర్హ బర్త్‌డే వేడుకలు జరిగాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ బర్త్‌డే వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా బన్నీ అద్దిరిపోయేలా ప్లాన్ చేసారు.

ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాపై జరిగిన మొదటి పుట్టినరోజు వేడుక అల్లు అర్హ దే. ప్రైవేట్ అంతస్తులో పబ్లిక్ అనుమతి లేదు.. ఇప్పటి వరకు ఈ స్థాయిలో పుట్టినరోజు పార్టీ ఏదీ నిర్వహించలేదు. అలా జరిగిన మొదటి పుట్టిన రోజు అర్హది మాత్రమే కావడం విశేషం. దీంతో అర్హ పుట్టిన రోజు వేడుకులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక అల్లు స్నేహా రెడ్డి అల్లు అర్హ పుట్టిన రోజూ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసింది. స్నేహ షేర్ చేసిన వీడియోలో.. అర్హ చెస్‌ గేమ్‌ ఆడుతూ సందడి చేస్తుంది. ఒకే చోట చాలా చెస్ బోర్డులు పెట్టి ఒక్కొక్క చేస్‌ గేమ్‌ బోర్డులో పావులు కదుపుతూ, పరిగెడుతూ, నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ ఉంది అర్హ.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news