Moviesచిరంజీవి - మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి విడిపోవ‌డానికి ఆ సంఘ‌ట‌నే కార‌ణ‌మైందా...!

చిరంజీవి – మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి విడిపోవ‌డానికి ఆ సంఘ‌ట‌నే కార‌ణ‌మైందా…!

తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఉన్నారు. నాటి త‌రం నుంచి నేటి త‌రం వ‌ర‌కు సుధీర్ఘ‌కాలంగా కెరీర్ కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి. రాజ్ – కోటి మ్యూజిక్ అంటే అప్ప‌ట్లో పెద్ద సంచ‌లనం. ఆ త‌ర్వాత రాజ్ నుంచి కోటి విడిపోయినా కూడా కోటి టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యారు. ఎంతో మంది స్టార్ హీరోల‌కు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్స్ ఇచ్చారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవికి, కోటికి మ‌ధ్య అనుకోకుండా మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ట‌. ఈ విష‌యాన్ని కోటీయే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. చిరంజీవి – కోటి కాంబినేష‌న్లో 12 సినిమాలు వ‌చ్చాయ‌ట‌. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్లు వీరు క‌లిసి కొట్టారు. అయితే ఓ సినిమా ఫంక్ష‌న్ ఒంగోలులో జ‌రుగుతున్న‌ప్పుడు కోటి రెండు రోజుల ముందుగానే ఒంగోలు ప‌క్క‌నే ఉన్న కోటి వాళ్ల అత్తగారింట్లో దిగిపోయార‌ట‌.

అయితే వాతావ‌ర‌ణం మార‌డంతో జ‌లుబు , జ్వ‌రం వ‌చ్చి ఆ ఫంక్ష‌న్‌కు వెళ్ల‌లేని స్థితిలో ఉన్నార‌ట కోటి. అలా ఆ ఫంక్ష‌న్‌కు కోటి వెళ్ల‌క‌పోవ‌డంతో కొంద‌రు మాత్రం చిరంజీవికి వేరేగా ఫీడ్ బ్యాక్ ఇచ్చార‌ట‌. ఇక్క‌డ‌కు వ‌చ్చి కూడా కావాల‌నే ఆడియో ఫంక్ష‌న్‌కు రాలేద‌ని చెప్పార‌ట‌. వాస్త‌వానికి చిరంజీవి గారితో 100 డేస్ ఫంక్ష‌న్ అంటే ఎవ‌రికి అయినా వెళ్లాల‌నే ఉంటుంది.. కానీ తాను వెళ్లే ప‌రిస్థితి లేకే వెళ్ల‌లేద‌ని ఆయ‌న అన్నారు.

ఆ త‌ర్వాత తాను చిరంజీవి గారిని క‌లిసేందుకు వెళ్లినా ఆయ‌న త‌న‌తో మాట్లాడే ప‌రిస్థితుల్లో లేర‌ని చెప్పార‌ని.. త‌న ప్లేస్‌లో మ‌రో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను పెట్టుకున్నార‌ని తెలయ‌డంతో తాను బాధ‌తో వెన‌క్కు వ‌చ్చేశాన‌ని కోటి తెలిపారు. హిట్ల‌ర్ సినిమా త‌ర్వాత చిరంజీవి తాను క‌లిసి ప‌నిచేయ‌లేద‌ని.. ఆ సినిమా ఫంక్ష‌నే త‌మ ఇద్ద‌రిని విడ‌దీసింద‌ని కోటి చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news