Moviesఆ సినిమాలో హాట్ రొమాన్స్‌కు అత‌డే కార‌ణ‌మంటోన్న రాశి..!

ఆ సినిమాలో హాట్ రొమాన్స్‌కు అత‌డే కార‌ణ‌మంటోన్న రాశి..!

తెలుగులో 20 సంవ‌త్స‌రాల క్రితం ఓ వెలుగు వెలిగింది రాశి. త‌న అందంతో అప్ప‌ట్లో కుర్ర‌కారును క‌ట్టిపడేసిన రాశి.. చాలా సినిమాల్లో గ్లామ‌ర‌స్ క్యారెక్ట‌ర్లే వేసింది. అయితే కొన్ని సినిమాల్లో ఆమె గ్లామ‌ర్ డోస్ మ‌రీ ఎక్కువైంద‌న్న కామెంట్లు కూడా వినిపించేవి. అయితే మ‌హేష్‌బాబు హీరోగా వ‌చ్చిన నిజం సినిమాలో ఆమె చాలా బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించింది. ఈ సినిమాలో విల‌న్‌గా చేసిన గోపీచంద్ కీప్ పాత్ర‌లో న‌టించిన రాశీని చూసిన వారు వామ్మో ఇంత బోల్డ్ ఏంట్రా.. అస‌లు క్యారెక్ట‌ర్ ప‌చ్చిగా ఉంద‌నే పెద‌వి విరిచారు. రాశీ నుంచి ఇలాంటి క్యారెక్ట‌ర్ ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.

అయితే తాను ఇంత బోల్డ్ పాత్ర ఎందుకు వేయాల్సి వ‌చ్చింది.. తెర వెన‌క ఏం జ‌రిగింది అన్న విష‌యాన్ని రాశీ త‌ర్వాత ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. ఈ సినిమాలో గోపీచంద్ ప‌క్క‌న మీరు న‌టించాల‌ని చెప్పిన‌ప్పుడు మ‌హేష్‌బాబు హీరో క‌దా ? పెద్ద సినిమా.. మంచి పేరు వ‌స్తుంద‌ని ఒప్పుకుంద‌ట‌. ద‌ర్శ‌కుడు తేజ ముందుగా త‌న పాత్ర గురించి త‌న‌కు చెప్పిన విధంగా కాకుండా.. మ‌రో లా త‌న పాత్ర‌ను మార్చేశార‌ని ఆమె చెప్పింది.

త‌న‌కు చెప్పింది ఒక‌టి.. తెర‌మీద చూపించింది మ‌రొక‌టి అని.. అస‌లు ఆ పాత్ర ముందు నుంచి త‌న‌కు ఇష్టం లేకుండానే చేశాన‌ని చెప్పింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక త‌న‌పై విమ‌ర్శ‌లు ఎక్కువ అవ్వ‌డంతో పాటు అస‌లు ఇక‌పై అలాంటి పాత్ర‌లు చేయ‌వ‌ద్ద‌ని అభిమానుల నుంచి విన‌తులు వ‌చ్చాయ‌ని రాశి చెప్పింది. ఇక నిజం సినిమా ఒక్క‌డు సినిమా త‌ర్వాత రిలీజ్ అయ్యింది. 2003 ఏప్రిల్లో వ‌చ్చిన నిజం భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. ఇక ఇప్పుడు రాశీ సెకండ్ ఇన్సింగ్స్‌లో అత్త పాత్ర‌లు పోషించాల‌ని చూస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news