Moviesసినిమా ఛాన్సులు ఇస్తామ‌ని స‌నాను న‌మ్మించి మోసం చేసింది ఎవ‌రు ..!

సినిమా ఛాన్సులు ఇస్తామ‌ని స‌నాను న‌మ్మించి మోసం చేసింది ఎవ‌రు ..!

సన తెలుగు సినిమాల్లోనే కాకుండా సౌత్‌లో టాప్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. ఇండ‌స్ట్రీలో మూడు ద‌శాబ్దాలుగా ఆమె త‌న‌దైన పాత్ర‌ల ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఆమె ముస్లిం అయినా కూడా తెలుగు భాష‌పై ఆమెకు ఉన్న ప‌ట్టుకు ప్ర‌శంసించాల్సిందే. త‌ల్లిగా, వ‌దిన‌గా, చెల్లి, అక్క‌గా ఎంతో మంది టాప్ హీరోల సినిమాల్లో మంచి పాత్ర‌లు వేసి ఆమె మెప్పించింది.

కేవ‌లం వెండితెర మీద మాత్ర‌మే కాకుండా.. బుల్లితెర మీద సీరియ‌ల్స్‌లో ఆమె ప‌లు పాత్ర‌ల‌లో న‌టించింది. స‌న నెగిటివ్ రోల్స్‌తో కూడా మెప్పించింది. అయితే ఆమె ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో ఎన్నో ఇబ్బందులు ప‌డింద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా చెప్పింది. ఇండ‌స్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు కెరీర్ తొలి నాళ్ల‌లో ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌తారో స‌న కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంద‌ట‌.

ఆలీ షోలో పాల్గొన్న ఆమె సినిమా ప‌రిశ్ర‌మలో త‌న‌కు ఎంతో మంది సాయం చేశార‌ని.. అయితే కొంద‌రు త‌న‌ను మోసం చేశార‌ని ఆమె భావోద్వేగానికి గురైంది. కంట‌త‌డిపెట్టిన ఆమెను ఆలీ ఓదార్చాడు కూడా..! ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో తాను కొంద‌రిని గుడ్డిగా న‌మ్మి మోస‌పోయాన‌ని చెప్పింది. కెరీర్‌లో నిల‌దొక్కు కునేందుకు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాన‌ని.. ఆ త‌ర్వాత ఆ క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డి నిల‌దొక్కుకున్నాన‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news