Moviesచెన్నై చంద్రం అరుదైన ఘనత.. తొలి తమిళ నటిగా రికార్డు క్రియేట్...

చెన్నై చంద్రం అరుదైన ఘనత.. తొలి తమిళ నటిగా రికార్డు క్రియేట్ చేసిన త్రిష..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన త్రిష గురించి తెలియనివారంటూ ఉండరు. ఆమె తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్స్ లో త్రిష ఒకరు. త్రిష కృష్ణన్, ‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన ‘వర్షం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది.

అంతేకాదు ఆ తర్వాత తెలుగులో అందరి అగ్ర హీరోల సరసన మెరిసింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చెన్నై చంద్రం. త్రిష తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఎంతో అద్భుతంగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కట్టా మీటా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చెన్నై చంద్రం త్రిష.

దాదాపు 40 వ‌య‌స్సుకు చేరువలో ఉన్నా ఈ ముదురు ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. అప్పుడెప్పుడో జోడీ సినిమాతో సినిమాల్లోకి వ‌చ్చిన ఆమె తెలుగులో నీ మ‌న‌సు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. అన‌తి కాలంలోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

కాగా ఈ స్టార్‌ హీరోయిన్‌ అరుదైన ఘనతను సొంతంగా చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా ఆమెను వరించింది. అంతేకాకుండా.. ఈ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా త్రిష యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందంటూ మురిసిపోతోంది. 2019నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేయడం మొదలుపెట్టింది. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు.

Happy and privileged to be the first Tamil actor to have received the golden visa😀

Thank you🙏🏻 @emiratesfirst
@jamadusman @rjrijin
@efirstglobal @alsaadgdrfa @gdrfa @dubai #uaegovernment #dubaiculture pic.twitter.com/MgCnwtZj5m

— Trish (@trishtrashers) November 3, 2021

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news