Moviesభీమ్లా నాయ‌క్‌కు హైప్ కోసం.. ల‌క్ష‌లు త‌గ‌లేస్తోన్న థ‌మ‌న్‌..!

భీమ్లా నాయ‌క్‌కు హైప్ కోసం.. ల‌క్ష‌లు త‌గ‌లేస్తోన్న థ‌మ‌న్‌..!

పెద్ద సినిమాల‌కు రిలీజ్‌కు ముందు భారీ హైప్ ఉండాలి. దానిని బట్టే బిజినెస న‌డుస్తుంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల టాలీవుడ్‌లో క‌వ‌రింగ్ సాంగ్స్ వ‌స్తున్నాయి. ఒరిజిన‌ల్ పాట‌కే ఓ స్పెష‌ల్ వీడియో చేసి మ‌రీ రిలీజ్ చేస్తున్నారు. అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకు థ‌మ‌న్ చేసిన క‌వ‌రింగ్ సాంగ్ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చింది. అలా ఆ సాంగ్ సినిమాకు ప్ల‌స్ అవ్వ‌డంతో పాటు మంచి బిజినెస్ జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మైంది.

ఇక ఇటీవ‌ల ఈ క‌వ‌రింగ్ సాంగ్ విష‌యంలో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు థమన్ – అనిరుధ్ – దేవీశ్రీప్రసాద్ లాంటి వాళ్లు స్పెష‌ల్ కేర్ తీసుకుని.. స్పెష‌ల్ వీడియోలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమాను లేపేందుకు థ‌మ‌న్ అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నాడ‌ట‌. అస‌లే ఇది రీమేక్ సినిమా. మ‌రోవైపు సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు పోటీగా వ‌స్తామ‌ని చెపుతున్నారు. ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు వెన‌క‌డుగు వేసే ప్ర‌శ‌క్తే లేద‌ని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

అందుకే సినిమాకు మంచి ప్రి రిలీజ్ బ‌జ్ వ‌చ్చేందుకు ఓ క‌వ‌రింగ్ సాంగ్‌ను ప్లాన్ చేశార‌ట‌. ఈ డ్యూటీ తీసుకున్న థ‌మ‌న్ అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ క‌వ‌రింగ్ సాంగ్ షూట్ చేస్తున్నార‌ట‌. ఈ ఒక్క సాంగ్ కోస‌మే 30 మంది ప‌ని చేస్తున్నార‌ట‌. ఓవ‌రాల్‌గా థ‌మ‌న్ నిర్మాత‌ల‌కు భారీగానే చేతి చ‌మురు వ‌దిలిస్తున్నాడు. మ‌రి ఈ సాంగ్ సినిమాకు ఎంత హైప్ తెస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news