Moviesఒకే సినిమాలో 9 మంది హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసిన బాల‌య్య‌...!

ఒకే సినిమాలో 9 మంది హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసిన బాల‌య్య‌…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణకు పౌరాణికంలోనే కాకుండా సాంఘీక క‌థ‌ల్లోనూ ఎలాంటి పాత్రలో అయినా న‌టించ‌డం కొట్టిన పిండే. త‌న తండ్రి దివంగ‌త ఎన్టీఆర్ వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకున్న బాల‌య్యకు పౌరాణిక పాత్ర‌ల్లో ఇప్పుడు ఉన్న ఏ హీరో కూడా పోటీ వ‌చ్చే ప‌రిస్థితి లేదు. బాల‌య్య త‌న కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో న‌టించాడు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో బాల‌య్య వందో సినిమా పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు బ్రేకు లేకుండా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

ఇక బాల‌య్య ఒకే సినిమాలో ఏకంగా 9 మంది హీరోయిన్ల‌తో రొమాన్స్ చేశాడు. ఆ సినిమా ఏదో కాదు త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌గా వ‌చ్చిన క‌థానాయ‌కుడు సినిమాల్లోనే..! బాల‌య్య కెరీర్‌లో వందో సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను హిట్ చేసిన క్రిష్ డైరెక్ష‌న్‌లోనే ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలు తెర‌కెక్కాయి. ఇక తొలి భాగం క‌థానాయ‌కుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌లో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్ న‌టించింది.

శ్రీదేవిగా ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, సావిత్రిగా నిత్యామీన‌న్ న‌టించారు. స‌రోజాదేవిగా అనుష్క‌, షావుకారు జాన‌కీగా షాలినీ పాండే అద్భుతంగా న‌టించారు. ఇక జ‌య‌ప్ర‌ద‌గా హ‌న్సిక న‌టించారు. జ‌య‌సుధ‌గా మాళ‌విక నాయ‌ర్‌, కృష్ణ‌కుమారిగా పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించారు. ఇలా ఒకే సినిమాలో తొమ్మిది మంది అంద‌మైన హీరోయిన్లు బాల‌య్య ప‌క్క‌న క‌నిపించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news