Movies' అఖండ ' టాక్ వ‌చ్చేసింది... సినిమా టాక్ ఎలా ఉందంటే..!

‘ అఖండ ‘ టాక్ వ‌చ్చేసింది… సినిమా టాక్ ఎలా ఉందంటే..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన లెజెండ్‌, సింహా రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో అఖండ ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ కొడుతుంద‌నే అనుకుంటున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు, సింగిల్స్‌, స్టిల్స్ అన్ని అఖండ‌పై అంచ‌నాలు అఖండ స్థాయిలో ఉండేలా చేశాయి. ఇక సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 2న రిలీజ్ అవుతోంది.

ఇక ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ / ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. అస‌లు బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్ అంటేనే యాక్ష‌న్ సన్నివేశాలు మోత మోగిపోవాల్సిందే. ఇప్పుడు అఖండ కూడా అదే రేంజ్‌లో ఉంద‌ని.. అందుకే యూ / ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింద‌ని అంటున్నారు.
ఇక అఖండ ర‌న్ టైం మొత్తం 2.47 గంట‌లు అంటే 167 నిమిషాల ఉంద‌ట‌.

ఇందులో సినిమా మొత్తం మీద 45 నిమిషాల పాటు అదిరిపోయే యాక్ష‌న్ ఉంటుంద‌ని సెన్సార్ టాక్‌. బాల‌య్య రెండు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో మాస్ ఫ్యాన్స్‌కు మాత్రం అదిరిపోయే ట్రీట్ అనే అంటున్నారు. ఇక అఘోర పాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో లేని విధంగా వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అదిరిపోయే ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు కూడా బాల‌య్య ఫ్యాన్స్‌కే కాకుండా.. మాస్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయంటున్నారు.

బాల‌య్య మార్క్ డైలాగులు, అదిరిపోయే ఫైట్లు, శ్రీకాంత్ – జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌లు, ప్ర‌గ్య జైశ్వాల్ అందాలు అన్నీ సినిమాకు హైలెట్స్ అంటున్నారు. ఇక సినిమా రిలీజ్‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్లు కూడా భారీ ఎత్తున చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అఖండ ను యూఎస్‌లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news