MoviesCrazy Announcement: బాలయ్యతో ‘ఆహా’ మరో సంచలనం..పైసా వసూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ షురూ..!!

Crazy Announcement: బాలయ్యతో ‘ఆహా’ మరో సంచలనం..పైసా వసూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ షురూ..!!

వరుస సినిమాలకు సైన్ చేస్తూ..యంగ్ హీరోలకు ఏమాత్రం తీసీపోకుండా తనదైన స్టైల్లో దూసుకుపోతున్న బాలయ్య..అఖండ సినిమాతో అతి త్వరలోనే మరో బ్లాక్ బస్టర్ విజయం అందుకోనున్నాడు. నిజానికి ఈ సినిమాపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి.

కాగా..నందమూరి బాలకృష్ణ, తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ కోసం ఓ టాక్ షో చెయ్యబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్యతో ఫొటోషూట్ కూడా చేశారని టాక్ వినిపించింది. అయితే ఈ వీషయమై అటు బాల కృష్ణ కానీ..ఇటు అహా కానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో..ఇది రూమర్ అని కొట్టిపడేసారు అభిమానులు. అయితే అది రూమర్ కాదు నిజమటూ..అహా ఓ ప్రకటన్ విడుదల చేసింది.

సరికొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో జోరు మీదున్న ‘ఆహా’.. తాజాగా మరో సంచలనానికి తెర తీస్తోంది. ఓటీటీలో తొలిసారి ఓ టాక్‌ షోను నిర్వహించడానికి రంగ సిద్ధం చేసింది. నందమూరి బాలకృష్ణతో కలిసి టాక్‌ షో నిర్వహించనున్నాం అంటూ అధికారికంగా ప్రకటన చేసింది. ఇప్పుడు బాలకృష్ణ టాక్ షో కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

బాలయ్య సరికొత్త లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’ అంటూ ఈ షో పేరు రివీల్ చేశారు. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే సాలిడ్ పేరు ఫిక్స్ చేశారు.దీంతో ఈ షోపై అటు బాలయ్య అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటి వరకు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన బాలయ్య బాబు తొలిసారి ఇంటర్వ్యూ చేస్తుండడంపై అందరిలోనూ ఆసక్తినెలకొంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news