Moviesమేం విడిపోతున్నాం అని చెప్పిన కొద్దిసేపటికే అలా చేసి..నాగ చైతన్యకి మైండ్...

మేం విడిపోతున్నాం అని చెప్పిన కొద్దిసేపటికే అలా చేసి..నాగ చైతన్యకి మైండ్ బ్లాకింగ్ షాకిచ్చిన సమంత..!!

టాలీవుడ్ రూమ‌ర్స్‌కు బ్రేక్ ప‌డింది. అంతా అనుకున్నదే జరిగింది. తీవ్ర ఉత్కంఠకి తెరపడింది. టాలీవుడ్‌ క్రేజీ కపుల్‌ నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు అదికారికంగా ప్రకటించారు. యంగ్ హీరో నాగ చైత‌న్య‌, స‌మంత‌లు వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. మొగుడు పెళ్లాలుగా విడిపోతున్న‌ట్లు ఇద్ద‌రూ ప్ర‌క‌టించారు. నాగ చైతన్య…తన ఎంతో ఇష్టపడి ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్న సమంత కు విడాకులు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. యస్.. మీరు చదువుతున్నది నిజమే. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న గాలి వార్తలే నిజమయ్యాయి.

టాలీవుడ్ సెలబ్రిటీ జంట సమంత, అక్కినేని నాగచైతన్య వేరుకుంపటి పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. 2017 అక్టోబర్ 6న గోవా లో ఘనంగా వివాహం చేసుకున్న చైతూ – సమంత విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నాగ చైత్న్య సమంత నిర్ణయం ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశమయ్యింది.

నాగ చైతన్య తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ..”ఎవరి దారిలో వాళ్లం నడవాలనుకుంటున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం అని నాగచైతన్య ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎమోషనల్‌ పోస్ట్ అభిమానులతో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే సమంత మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించినట్టు అనిపిస్తోంది.

సమంత తన విడాకుల విషయం మీద ప్రస్థావిస్తూ చేసిన అఫీషియల్ నోట్ కింద కామెంట్ల సెక్షన్లను కోజ్ చేసింది. మామూలుగా అయితే సమంత తన కామెంట్ల సెక్షన్లను క్లోజ్ చేయదు. అయితే ఈ విడాకుల విషయంలో కచ్చితంగా నెగెటివ్ కామెంట్లు వస్తాయని ముందే ఆలోచించినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైతేనేం చూడ చక్కని జంట విడిపోతుండడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news