Moviesవిడాకుల తరువాత సమంత తన పెళ్లి చీరను ఏం చేయబోతోందో తెలుసా..??

విడాకుల తరువాత సమంత తన పెళ్లి చీరను ఏం చేయబోతోందో తెలుసా..??

సమంత.. టాలీవుడ్ కుందనప్పు బోమ్మ. చూడడానికి చక్కటి రూపం..అందరిని ఆకట్టుకునే మాటలు..అద్భుతమైన నటనతో అందరి మనసులను గెలుచుకుంది. అన‌తి కాలంలోనే ఆమె ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్‌బాబు లాంటి స్టార్ హీరోల‌తో న‌టించి ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఆ టైంలో ఆమె ఒక్క‌టే స్టార్ హీరోయిన్‌గా ఉండ‌డంతో అవ‌కాశాలు అన్నీ ఆమెకే వ‌చ్చేశాయి. స‌మంత – చైతు ఇద్ద‌రూ కూడా పెళ్లికి ముందు.. పెళ్లి త‌ర్వాత కూడా త‌మ లైఫ్‌ను ఎంతో బాగా డిజైన్ చేసుకున్నారు.

ఇక టాలీవుడ్ బడా ఫ్యామిలీ అక్కినేని ఇంటి కోడళు గా అడుగుపెట్టి .. కోడలు గాను మంచి మార్కులు వేయించుకుంది. ఇక ఈ జంట పెళ్లి రోజు కు సరిగ్గా నాలుగు రోజుల ముందర తాము విడిపోతున్నాం అని ప్రకటించడంతో అభిమానులు నిరాశ చెందారు.రీజన్స్ ఏంటో చెప్పకుండానే..ఈ జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమైయారు. అక్కినేని దంపతులు విడాకులు తీసుకోవడం అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే సోషల్ మీడియా వేదికగా ప్లీజ్ డైవర్స్ తీసుకోకండి అంతూ మెసేజస్ పెడుతున్నారు.

ఇక ఇప్పుడు అందరి కళ్లు పెళ్లిలోసమంతా కట్టుకున్న చీర పైన ఉండటం గమనార్హం. ఎందుకంటే ఆ చీర కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ చీర‌ను చైతు అమ్మ‌మ్మ అంటే రామానాయుడు భార్య ద‌గ్గుబాటి రాజేశ్వ‌రి చీర‌నే రీ మోడ‌లింగ్ చేయించి.. దానినే ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించి మ‌రీ క‌ట్టుకున్నార‌ట‌. ఇందుకోస‌మే స‌మంత రు. 40 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖర్చు చేసిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. దీనిని ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్‌ డిజైన్ చేశారు. అయితే, ఇప్పుడూ సమంత అక్కినేని ఇంటి కోడలు పోస్ట్ నుండి తప్పుకుంటుంది కాబబటి ..ఆ చీర పై ఆమెకు ఎలాంటి హక్కు ఉండదంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి అక్కినేని.. దగ్గుబాటి వంశానికి చెందిన ఈ సంప్రదాయ చీరను సమంత చైతన్య కి తిరిగి ఇచ్చేస్తుందా..? అనే విషయం పై ఇప్పుడు టాలీవుడ్ లో తెగ చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news