Moviesఆనందానికి కేరాఫ్ అడ్రెస్ అంటే వీడు.. అద్దరగొట్టేశాడుగా..!!

ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ అంటే వీడు.. అద్దరగొట్టేశాడుగా..!!

న‌వ్వించ‌డం అంత ఈజీ కాదు. అది కూడా ఆరోగ్య‌క‌ర‌మైన దారిలో. ఆ నాడీ ప‌ట్టేసుకున్నాడు మారుతి. త‌న సినిమాల్లో కామెడీ బాగుంటుంది. క్యారెక్ట‌రైజేష‌న్లు గుర్తిండిపోతాయి. త‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తీసుకొచ్చింది కూడా ఆ బ్రాండే. ఇప్పుడు అదే మార్క్ తో మ‌రో సినిమా చేశాడు. అదే… మంచి రోజులొచ్చాయి. మారుతీ దర్వకత్వంలో తాజాగా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా చక్కని స్పందన వచ్చింది. ‘మహానుభావుడు’ లాంటి హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. “మంచి రోజులొచ్చాయి” సినిమాను వి సెల్యులాయిడ్ బ్యానర్ లో ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాను వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రచారాన్ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్‌ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.

మై వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్‌..నా పేరు సంతోష్..ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ వీడు అనేది నా ట్యాగ్‌లైన్..అంటూ సంతోష్ శోభ‌న్ త‌నను తాను ప‌రిచ‌యం చేసే సన్నివేశంతో ట్రైల‌ర్ మొద‌లైంది. ఓ కాల‌నీలో జ‌రిగే క‌థ ఇది. అక్క‌డ క‌నిపించే ర‌క‌ర‌క‌కాల పాత్ర‌లు.. వాటిమ‌ధ్య పండించే వినోదం – మ‌ధ్య‌లో క‌రోనా. మ‌నుషులు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం – ఇదీ స్థూలంగా క‌థ‌. ఈ టీజ‌ర్‌లో పాత్ర‌ల‌న్నింటినీ ప‌రిచ‌యం చేశాడు మారుతి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news