Moviesబిగ్ బ్రేకింగ్: సమంత కు విడాకులు ఇస్తున్న.. అధికారికంగా ప్రకటించిన నాగ...

బిగ్ బ్రేకింగ్: సమంత కు విడాకులు ఇస్తున్న.. అధికారికంగా ప్రకటించిన నాగ చైతన్య..!!

గుండె పగిలే వార్త చెప్పాడు నాగ చైతన్య. తన ఎంతో ఇష్టపడి ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్న సమంత కు విడాకులు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. యస్.. మీరు చదువుతున్నది నిజమే. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న గాలి వార్తలే నిజమయ్యాయి. టాలీవుడ్ సెలబ్రిటీ జంట సమంత, అక్కినేని నాగచైతన్య వేరుకుంపటి పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. అంతా అనుకున్నదే జరిగింది. తీవ్ర ఉత్కంఠకి తెరపడింది. టాలీవుడ్‌ క్రేజీ కపుల్‌ నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు దీనిపై మౌనంగా ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ప్రకటించారు. విడాకులు తీసుకుంటున్నట్టు నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

2017 అక్టోబర్ 6న గోవా లో ఘనంగా వివాహం చేసుకున్న చైతూ – సమంత విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. హిందూ క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్న .. వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికలపై సమంత తన పేరు వెనుక అక్కినేని సర్ నేమ్‌ను తొలగించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. సమంత నిర్ణయం ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశమయ్యింది.

నాగ చైతన్య తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ..”ఎవరి దారిలో వాళ్లం నడవాలనుకుంటున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం అని నాగచైతన్య ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎమోషనల్‌ పోస్ట్ అభిమానులతో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నాగచైతన్య, సమంత 2017 అక్టోబర్‌ 6న ప్రేమించి పెళ్లి చేసుకున్న విసయం తెలిసిందే. నాలుగేళ్లకే విడాకులు ప్రకటించి అందరిని షాక్‌కి గురి చేశారు. ఇక వీరిద్దరు కలిసి మొత్తం నాలుగు సినిమాల్లో నటించారు. ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ ..టాలీవుడ్లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ప్రసిద్ధి చెందిన వీరు..ఇలా విడాకులు తీసుకోవడం అభిమానులకు ఏమాత్రం నచ్చడంలేదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news