Newsపైశాచిక తండ్రి: కామంతో కళ్లుమూసుకుపోయి..పసిపాపపై దారుణంగా అత్యాచారం..!!

పైశాచిక తండ్రి: కామంతో కళ్లుమూసుకుపోయి..పసిపాపపై దారుణంగా అత్యాచారం..!!

రాను రాను సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది అని అనిపిస్తుంది జరిగే సంఘటనలు చూస్తుంటే. పసిపాపా దగ్గర నుండి ..పండు ముసలి వాళ్ల వరకు రక్షణ్ కరువైంది. ప్రతి రోజు వచ్చే రేప్ & మర్డర్లు.. అంటూ వచ్చే వార్తలే అందరిని కలిచివేస్తున్నాయి. నిందితులకు శిక్షలు కఠినంగా వేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా వార్తలను వింటూనే ఉన్న తరుణంలో మరో ఉదంతం చోటు చేసుకుంది.

ఓ ఆగంతకుడు ఎవరో అమ్మాయిని చిదిమేసి చంపితేనే మనం ఇంత మరిగిపోతున్నాము. అలాంటిది ప్రేమగా చూసుకోవాల్సిన కన్న తండ్రినే అత్యాచారం చేస్తె అంతకన్న ఘోరం మరోకటి ఉండదు. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రవర్తించాడు. వంకర ఆలోచనలతో సభ్యసమాజం ఛీ కొట్టేలా ప్రవర్తించాడు. కన్న కూతురిని కాపాడాల్సిన బాధ్యతను మరిచి అతడే ఆమెను కాటేశాడు. వావివరుసలు మరిచి కన్నకూతురినే కాటేసిన ఓ కసాయి తండ్రి చేఇన పనికి అందరు ఛీ కొడుతున్నారు. అభం-శుభం తెలియని తమ ఆరేళ్ళ పాపను అత్యంత దారుణంగా బలాత్కరించిన ఈ హృదయ విషాదకరణ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

ఆరేళ్ళ కూతురిపైనే కాకుండా కూతురు వరయ్యే మరో బాలికపైనా అత్యాచారానికి ఒడిగట్టాడు ఈ కామాంధుడు. ఆగస్ట్ 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తూ.గో జిల్లా ఏలేశ్వరం మండలానికి చెందిన ఓ 14ఏళ్ల బాలిక ఆగస్ట్ 15న అత్యాచారానికి గురయ్యింది. అయితే ఈ విషయం ఎవరికైన చెప్పితే చంపేస్తా అని దుండగుడు బాలికను బెదిరించడంతో ఆమె ఈ విషయాని ఎవరికి చెప్పలేదు. తాజాగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. దీంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని విచారిస్తున్న సమయంలో మరో షాకింగ్ విషయం బయటపడ్డింది. ఈంతో పోలీసులు కూడా షాకయ్య్యారు. ఈ కామాంధుడు ఆరేళ్ల సొంత కూతురిపైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన ఇతడికి కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news