Moviesఅబ్బాయికి గర్భం వస్తే .. అందరి మతులు పోగొడుతున్న బిగ్ బాస్...

అబ్బాయికి గర్భం వస్తే .. అందరి మతులు పోగొడుతున్న బిగ్ బాస్ సోహెల్‌ .!!

సోహెల్‌..ఈ పేరు ఒకప్పుడు పెద్దగా ఎవరికి తెలియదు. కానీ బిగ్ బాస్ నాలుగో సీజ‌న్ త‌ర్వాత ఈ పేరు మారుమ్రోగిపోతుంది. జనరల్ గా బిగ్ బాస్ తరువాత ప‌లువురు కంటెస్టెంట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మరీ ముఖ్యంగా సోహెల్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. తోటి కంటెస్టేంట్ అరియానాతో ఫైటింగ్..ఆ కోపం..ఫైనల్‌లో పాతిక లక్షలు తీసుకుని కథ మొత్తం మార్చేసిన ఈ పోరడు..ఇప్పుడు వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటున్నాడు.

తాజాగా సోహెల్ నటించిన సినిమా ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశాడు. సోహెల్ కొత్త చిత్రానికి మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే వినూత్నమైన కథతో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ను తాజాగా హీరో నాని విడుదల చేశారు.. ‘ఈ టైమ్ లో ఫైట్ ఏంట్రా..? కడుపుతో వున్నానని చెప్పుతున్నానుగా..’ అంటూ సోహెల్ చెప్పే డైలాగ్స్ మరింత ఆసక్తికరంగా వున్నాయి.

మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెబుటెంట్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.టాలీవుడ్ లో ఓ కొత్త వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా చక్కని ప్రయోగాత్మక సినిమా అవుతుందని తెలుస్తోంది. ఇందులో సొహెల్ సరసన రూప నటిస్తోంది. సుహాసిని మణిరత్నం, బ్రహ్మాజి, అలీ, హర్ష కీలక పాత్రలు పోషించారు.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news