Moviesవామ్మో.. ఆ క్రేజీ బ్యూటీతో పవర్ స్టార్ రోమాన్స్..టూ హాట్ గురు..?

వామ్మో.. ఆ క్రేజీ బ్యూటీతో పవర్ స్టార్ రోమాన్స్..టూ హాట్ గురు..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్..వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి..ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సంగతి త్లిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హారిష్ శంకర్ ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రీపీట్ అవుతుందడంతో… అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు.

ఇప్ప‌టికే భీమ్లా నాయ‌క్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన ప‌వ‌న్ త్వ‌ర‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొన‌నున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఓ అద్దిరిపోయే వార్త బయటకు వచ్చింది. అది ఏమిటంటే.. ఎన్నో అంచనాల తో తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ లో పవన్ పక్కన టాలీవుడ్ బుట్టబోమ్మ పూజా హెగ్డే హీరోయిన గా సెలక్ట్ చేసారట మేకర్స్.

పూజా పవన్ కళ్యాణ్ తో రోమాన్స్ కు రెడీ అయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ కాంబినేషన్ గురించి అభిమానులు దిస్ కపుల్ టూ హాట్ గురూ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ స్టోరీ చెప్పదా.. ఆ స్టోరీ లైన్ కు ఫ్లాట్ అయినా పూజ .. వెంటనే ఒకే చెప్పేసిందట. ఇక పూజ హెగ్డే తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె చేతిలో పలు బడా భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news