Moviesద్యావుడా.. బిగ్ బాస్ 5 కోసం నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్..ఎంతో తెలుసా..??

ద్యావుడా.. బిగ్ బాస్ 5 కోసం నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్..ఎంతో తెలుసా..??

స్టార్ మా ఛానల్ లో కొన్నేళ్లుగా ప్రసారం అవుతున్న క్రేజియెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ముందుగా ఈ షో ఫస్ట్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి షో పై తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో తెలుగు బుల్లితెర మీద పెద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేశాడు అనే చెప్పాలి.అది ఎంతలా అంటే.. బిగ్ బాస్ షో TRPs అమాంతం పెరిగిపోయింది.

తెలుగులో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ షో తొలి సీజ‌న్ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో చూశాం. ఆ తరువాత హీరో నాని ,హీరో అక్కినేని నాగారజున షో ని హోస్ట్ చేసినా..తారక్ స్దాయి ని రీచ్ కాలేకపోయారు. ఆ మాట‌కు వ‌స్తే ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్‌లో తొలి సీజ‌న్‌లో ఉన్నంత ఊపు మిగిలిన సీజ‌న్లలో లేద‌నే చెప్పాలి. ఎన్టీఆర్ ఎన‌ర్జీ, ఛ‌రిష్మా బిగ్‌బాస్‌ను టాప్ లెవ‌ల్లో నిల‌బెట్టేశాయి.

తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ‘టన్నుల కొద్దీ కిక్’ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల నడుమ ఈ షో సెప్టెంబర్ 05 సాయత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‏బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్‌పై హోరెత్తించారు.

అయితే ఇక్కడ షాకింగ్ ఏమిటంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి భారీగా ఖర్చు చేసిన బిగ్ బాస్ టీమ్ మొత్తంగా షో హోస్టింగ్ కి గాను నాగార్జునకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు ఓ వార్త నెటింట్లో వైరల్ గా మారింది.లీకైన సమాచారం ప్రకారం నాగార్జున ఈ షో కోసం ఏకంగా రూ. 14 కోట్ల రెమ్యునరేషన్ తీస్తున్నారట. ఇంత భారీ పారితోషకం సౌత్ లో ఒకింత ఎక్కువే. గత సీజన్స్ ని ఎంతో రక్తికట్టించిన నాగ్ ఈ సీజన్ ని కూడా మరింతగా సక్సెస్ చేస్తారనే భావన తోనే నిర్వాహకులు కూడా ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధం అయ్యారట. తాజాగా చూసుకున్న లెక్కల ప్రకారం..ఈ ఐదవ సీజన్ గత సీజన్స్ కంటే మరింతగా దూసుకుపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. మరీ చూడాలి ఏం జరుగుతుందో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news