Moviesఅలాంటి పాత్రకైన రెడీ..కానీ మెలిక పెట్టిన అనసూయ..?

అలాంటి పాత్రకైన రెడీ..కానీ మెలిక పెట్టిన అనసూయ..?

అనసూయ .. ఓ అందాల యాంకర్ . జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ అంటే బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు ఆ ఒక్క షో ద్వారా చాలా పాపులర్ అయ్యింది. షోలో కామెడీతో పాటుగా అనసూయ అందాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. పొట్టి పొట్టి..బిగుతైన డ్రెస్సులు..ఒంటికి అతుక్కుపోయే శారీస్..మత్తెక్కించే మాటలు…డ్యాన్సులు ఇలా అన్ని రకాలుగా కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది.

అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. బుల్లితెర మీద తన అందాలతో అలరిస్తున్న అమ్మడు వెండితెర మీద కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది. రంగస్థలం సినిమాలో ఆమె నటనతో అందరిని మెప్పించగా ఇంకా మరిన్ని ఛాన్సులు అందుకుంటుంది. ఇదిలా ఉంటే సినిమాలలో ఇవే పాత్రలు చేయాలనీ తనేం కమిట్ అవ్వలేదని, మంచి పాత్రలు వస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమనే అంటోది ఈ బుల్లితెర బ్యూటీ.

ఇక చివరికి అమ్మ పాత్రలు చేయడానికి కూడా రెడీ అంటూ గ్రీన్ సిగనల్ ఇచ్చింది అనసూయ. అయితే అలాంటి పాత్రలు చేయడానికి కొని కండిషన్స్ పెట్టింది. అదేంటంటే.. అలాంటి పాత్రలు చేసినప్పడు ఆ సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు ఆ పాత్ర గురించి మాట్లాడుకోవాలని ఓ ఇంటర్వ్యూ లో చెపుకొచ్చింది అనసూయ. కాగా ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ సుకుమార్ “పుష్ప”లో ..అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రంగమార్తాండ” సినిమాలో ఓ కీ రోల్ పోషిస్తోంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news