Moviesఆ స్టార్ డాటర్ కోరికను ఎన్టీఆర్ తీరుస్తాడా..??

ఆ స్టార్ డాటర్ కోరికను ఎన్టీఆర్ తీరుస్తాడా..??

సీనియర్ నటులు మంజుల-విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ గురించి మనకు తెలిసిందే. ఆ తరం వారికి ఆమె దేవి సినిమాలతో పరిచయం అయితే ఈ తరం వారికి మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకుని నాలుగో పెళ్లికి సిద్ధం అంటూ ప్రకటన చేసి వివాదాలతో దగ్గరయింది. కోలీవుడ్‌లో ఇటీవ‌ల వ‌రుస వివాదాల‌కు కేరాఫ్‌గా మారింది వ‌నితా విజ‌య్‌కుమార్‌..తెలుగులో దేవి సినిమాలో కూడా న‌టించింది. అయితే వ‌రుస పెళ్లిళ్ల‌తో ఆమె న్యూస్‌లో ఉంటోంది. అప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన ఆమె గ‌త లాక్‌డౌన్‌లో పీట‌ర్ పాల్ అనే వ్య‌క్తిని మూడో పెళ్లి చేసుకుని మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

అయితే ఆమె త‌న మూడో భ‌ర్త‌ను కూడా వ‌దిలేసింది. 40 ఏళ్ల వ‌య‌స్సులో ఆమె చేసుకున్న పెళ్లి మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోయింద‌ని కూడా ప‌లువురు సెటైర్లు వేసారు. మ‌రి కొంద‌రు వనిను తిడితే ఆమె వాళ్ల‌పై చిర్రుబుర్రు లాడింది. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి వనిత విజయ్ కుమార్ ..తాజాగా బుల్లితెరపై ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా వనిత పలు ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించారు.

దేవి సినిమా తర్వాత తెలుగులో మళ్లీ ఎందుకు కనిపించలేదు అని ఆలీ ప్రశ్నించగా.. నాకు బుర్ర లేదంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇక తనకు అప్పట్లో టాలీవుడ్ మనంధుడు అక్కినేని నాగార్జున అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన వనిత.. ఇప్పుడున్న హీరోల్లో యొగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా అభిమానం .. ఆయన తో ఒక్క షాట్ అయినా పర్వాలేదని అది తన జీవితకాల డ్రీమ్ అని మనసులో మాట బయటపెట్టారు వనిత. మరి చూడాలి తారక్ ఈమె కోరిక తీరుస్తాడా లేదో…

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news