Moviesషాకింగ్: 9 ఏళ్ల తర్వాత లీకైన పెద్దోడు, చిన్నోడు పేర్లు..??

షాకింగ్: 9 ఏళ్ల తర్వాత లీకైన పెద్దోడు, చిన్నోడు పేర్లు..??

ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, బంధాలు, బాంధవ్యాలు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన కథాంశంతో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..” సినిమా తియ్యటం సాహసమే. అందులోనూ హీరోల ఫ్యాన్స్ ఎవేర్ నెస్ పెరిగిన నేపధ్యంలో ఎవరినీ నొప్పించకుండా మల్టి స్టారర్ చిత్రం రూపొందించి, ఒప్పించటం నిజంగా కత్తి మీద సామే.

అటువంటి అరుదైన ఫీట్ చేసారు దిల్ రాజు. కొత్త బంగారులోకంతో పరిచయం అయిన దర్శకుడు అండతో తెరపై అందరూ మర్చిపోతున్న మన లోకాన్ని మరోసారి స్పృశించి, గుర్తు చేసే ప్రయత్నం చేసారు. ఈ చిత్రానికి మహేష్, వెంకటేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలే బలంగా నిలిచాయి.

వెంకటేష్, మహేష్ బాబు.. కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో దీనికి సెపరేట్ ట్రెండ్ ఉందని చెప్పాలి. అయితే ఈ చిత్రంలో హీరోల పాత్రలకు పేర్లు ఉండవు. సినిమాలో వీళ్ళని పెద్దోడు, చిన్నోడు అనే పిలుస్తుంటారు. వెంకటేష్ పాత్రని పెద్దోడు అని .. అతని తమ్ముడు మహేష్ పాత్రని చిన్నోడు అని పిలుస్తుంటారు.

మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్నెట్ పేజ్ లో వెంకటేష్ పేరు మల్లికార్జున రావు.. మహేష్ బాబు పేరు.. సీతారామరాజు అని ఉంది. దీంతో ఈ సినిమాలో పెద్దోడు అంటే వెంకటేష్ పేరు మల్లికార్జున రావు అని..అలాగే చిన్నోడు అంటే మహేష్ బాబు పేరు సీతారామరాజు అని తెలుస్తుంది.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..వికీపీడియాలో కూడా వీళ్లిద్దరి పేర్లు పెద్దోడు చిన్నోడు అనే ఉంటాయి. ఏదేమైనా, అసలు ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు పేర్లు ఇవే అనే విషయం సినిమా రాసి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల కి అయినా తెలుసో లేదో అని అంటున్నారు నెటిజన్స్.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news