Moviesగ‌జాలా సూసైడ్ ఎటెంప్ట్‌కు ఆ హీరోనే కార‌ణ‌మా ?

గ‌జాలా సూసైడ్ ఎటెంప్ట్‌కు ఆ హీరోనే కార‌ణ‌మా ?

గజాల.. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అనతికాలంలోనే సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఆమె అప్పట్లో చేసుకున్న ఆత్మహత్యాయత్నం ఎంతటి వివాదానికి దారితీసింది అంటే , ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూడనంతగా .. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక హీరో తనను ప్రేమించి మోసం చేశాడని, ఆ బాధను తట్టుకోలేక ఆమె 2002వ సంవత్సరం జూలై 22వ తేదీన బంజారాహిల్స్ లో ఉన్న ప్రశాంత్ కుటీర్ గెస్ట్ హౌస్ లో ఆమె నిద్ర మాత్రలు మింగి , ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ మాత్రలు మింగిన తర్వాత హీరో అర్జున్ కి ఫోన్ చేసి,.. ఇక నేను నీకు కనిపించను అంటూ దీనంగా అర్ధించిందట.

Gajala Wiki Bio Age Husband Salary Photos Video News Ig Fb Tw

ఈ మాట వినగానే యాక్షన్ హీరో అర్జున్ హుటాహుటిన కుటీర్ పరిశ్రమ కు చేరుకొని ఆమెను నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ అర్జున్ ఈమె ను ఆసుపత్రిలో చేర్చడంతో అర్జున్ కారణంగా ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది అని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై అర్జున్ స్పందించిన తర్వాతనే ,ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. అయితే ఈమె ఇంకా ఆ రోజు నుంచి హైదరాబాద్ లో ఎక్కడా కనిపించలేదు. అయితే అప్పుడు కూడా ఆమె అభిమానులు గజాల ఏమైంది..? ఎక్కడుంది..? అని ఆరా తీయడం మొదలు పెట్టారు.

Action hero Arjun, first "Me Too" wicket in Kannada Film industry

హైదరాబాద్ నుంచి ముంబై కి వెళ్లి పోయిన తర్వాత, అక్కడ టీవీ సీరియల్ దర్శకుడు అయినటువంటి ,ఫైజల్ రజాఖాన్ చూసి నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఇక చివరిగా 2016 సంవత్సరంలో అతనిని పెళ్లి చేసుకుంది. అయితే ఈమె తన భర్త దర్శకత్వంలో పలు టీవీ సీరియల్స్ లో నటించాలని ఆసక్తి గా ఉందట. అప్పట్లో సినీ ఇండస్ట్రీకి దూరమైన గజాల ఇప్పుడు టీవీ సీరియల్స్ లో దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఏది ఏమైనా ఒక మంచి హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్ళింది అని చెప్పవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news