MoviesNTR నటించిన ఏకైక సీరియల్ ఏంటో తెలుసా..??

NTR నటించిన ఏకైక సీరియల్ ఏంటో తెలుసా..??

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈయనకు ఉన్న క్రేజ్ గురిచి ఎంత చెప్పిన తక్కువే. ఈయనకు మంచి వ్యక్తిత్వం, డెడికేషన్, కష్టపడే తత్వం వల్ల సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ”ఆర్ఆర్ఆర్” సినిమా లో ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస పెట్టి సినిమాలు అంగీక‌రించుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత కొర‌టాల శివ సినిమాను ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాతో పాటు ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో కూడా ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడు.

ఇక కొర‌టాల శివ డైరెక్ట్ చేసే సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ – యువ‌సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మిక్కిలినేని సుధాక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ రోల్ చేయ‌నున్నాడ‌ట‌. ఆర్ఆర్ఆర్ పూర్తైన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ఇక ఈ సినిమా కథను బట్టి తన మేక్ఓవర్ ను చేంజ్ చేసుకుంటున్నారట మన యంగ్ టైగర్ ఎన్టీఆర్.

అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ అప్పట్లో సీరియల్ లో నటించాడు అనే విషయం. ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బుల్లితెర పై ఓ సీరియల్ లో నటించాడనే విషయం బహుశా కొద్దిమందికి మాత్రమే తెలుసు.. ఇంతకీ ఎన్టీఆర్ నటించిన సీరియల్ ఏంటో తెలుసా..??..”భక్త మార్కండేయ”.ఈ సీరియల్ ఈటీవీ లో ప్రసారమయ్యేది. ఈ సీరియల్ లో లీడ్ రోల్ అయిన మార్కండేయ పాత్రని ఎన్టీఆర్ పోషించాడు. ఎన్టీఆర్ శివుడి భక్తుడిగా చిన్న వయసులోనే చాలా అద్భుతంగా ఆ పాత్రని పోషించాడు. ఇక ఇందులో మార్కెండేయ అనే పాత్రను పోషిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news