Newsఅయ్యో అయ్యో అయ్యయ్యో .. అడ్డంగా దొరికిపోయడే..?

అయ్యో అయ్యో అయ్యయ్యో .. అడ్డంగా దొరికిపోయడే..?

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా.. రానా ఒక కీలక రోల్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్లుగా నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ​ఈ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ట్రెండింగ్ లో ఉంచేందుకు ట్రై చేస్తోంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా.. టైటిల్‌, ఫ‌స్ట్ గ్లింప్స్ చిత్రయూనిట్ విడుద‌ల చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..అన్నట్లుగానే అదే స్థాయిలో ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. దీనిని చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ కావాల్సిందే.

పవాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుడగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఇక్కడ టీజర్‌లోని మ్యూజిక్‌ని కూడా థమన్ కాపీ చేశాడు అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ టీజర్‌లో ఓ బిట్‌లో థమన్ అందించిన సంగీతం.. ‘పెట్టా’ సినిమాలోని ఓ పాటలోని మ్యూజిక్‌ లాగా ఉంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news