Moviesఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్..ఆ హీరోయిన్ కి బాగా కాలిన్నట్లుందే..!!

ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్..ఆ హీరోయిన్ కి బాగా కాలిన్నట్లుందే..!!

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన మెహ్రీన్‌ ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమాలో మరియు ఇతర భాషల్లో కూడా నటిస్తుంది. నటిగా బిజీగా ఉన్న మెహ్రీన్ అనూహ్యంగా భవ్య బిష్ణోయ్ తో ప్రేమ పెళ్లి అంటూ షాక్ ల మీద షాక్ లు ఇచ్చి ఎంగేజ్ మెంట్‌ కూడా పూర్తి అయ్యిందని ఫొటోలు షేర్‌ చేసింది.

కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌‌తో మార్చి నెలలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న మెహ్రీన్.. ఉన్నట్టుండి సడెన్‌గా తన బ్రేకప్ విషయం బయటపెట్టడంతో అంతా షాకయ్యారు. కారణం ఏంటో కాని ఎంగేజ్ మెంట్‌ ను బ్రేక్‌ చేసినట్లుగా ఆమె ప్రకటించింది. దాంతో అప్పటి నుండి భవ్య బిష్ణోయ్‌ కుటుంబంపై మెహ్రీన్ అభిమానులు విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

దీంతో ఈ విషయమై భవ్య రియాక్ట్ అయ్యారు. తనకు మెహ్రీన్‌కి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నామని భవ్య బిష్ణోయ్‌‌ అన్నారు.పెళ్లి క్యాన్సిల్ విషయంలో తన కుటుంబాన్ని నిందిస్తే ఊరుకునేది లేదని భవ్య బిష్ణోయ్‌‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబానికి సమాజంలో మంచి గౌరవం ఉందని, ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. మెహ్రీన్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలపడం విశేషం.

అయితే తాజాగా ఓ అందమైన ఫోటోని షేర్ చేసిన మెహ్రీన్..దానికి ఒక్క షాకిం కోట్ ని యాడ్ చేసింది. “నా విలువ నాకు తెలుసు.నేను అందంగా ఉన్నానని చెప్తాను. నేను నా శక్తిని స్వీకరిస్తాను. మీరు నా కథను నిర్ణయించలేరు. నేనే నిర్ణయిస్తాను” అంటూ కోట్ చేసింది. ఈ కోట్ ఒకరిని పరోక్షంగా వేరొకరిని కొట్టినట్లు అనిపిస్తుంది కానీ మెహ్రీన్ ఎవరి గురించి కూడా ప్రస్తావించలేదు. ప్రస్తుతం చేసిన కోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news