Moviesచరిత్ర తిరగరాసిన ప్రభాస్.. ఇండియాలోనే కని విని ఎరుగని రికార్డ్..!!

చరిత్ర తిరగరాసిన ప్రభాస్.. ఇండియాలోనే కని విని ఎరుగని రికార్డ్..!!

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియా లెవల్ లో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభాస్ నుండి వచ్చే ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలే. ఒకరకంగా బాలీవుడ్ హీరోలకు సమానంగా.. అంతకు మించి దక్షణాదిలో కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోగా ప్రభాస్ ఇప్పుడు మంచి జోరు మీదున్నాడు.

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ లెటెస్ట్‌ మూవీ రాధేశ్యామ్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాధాకృష్ణ దర్శకత్వంతో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ గతేడాది అక్టోబర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ ఇప్పుడు యూట్యూబ్ లో ఓ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.ఇప్పటి వరకూ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ యూ ట్యూబ్ లో 21 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఒక మోషన్ పోస్టర్ యూ ట్యూబ్ లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించడం ఇండియా లో ఇదే తొలిసారి అని చెప్పాలి. మోస్ట్ వ్యూడ్ మోషన్ పోస్టర్ గా ఇండియా లో రికార్డ్ సృష్టించింది. ఈ విషయం బయటకొచ్చినప్పటి నుండి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీంతో పాటు ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news