Moviesప్రముఖ నటుడు సురేష్ భార్య కూడా స్టార్ హీరోయిన్ అని మీకు...

ప్రముఖ నటుడు సురేష్ భార్య కూడా స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా?? ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు!!

సురేష్ మల్టి టాలెంటెడ్ హీరో. నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా. దాదాపు సురేష్ 270 పైగా చిత్రాలలో నటించాడు. ఒకానొక కాలంలో చాలా సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల ఆదరణ కూడా పొందాడు. అప్పట్లో హీరో.. తర్వాత విలన్, ఇప్పుడు సపోర్టింగ్ పత్రాలలో కూడా నటిస్తున్నాడు.అప్పట్లోనే లవర్ బాయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ప్రార్థన, సూరిగాడు, అల్లరి పిల్ల, అమ్మోరు లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన సురేష్.. దర్శకుడిగా నిర్మాతగా కూడా అనేక చిత్రాలకు పనిచేశారు. టీవీ సీరియల్స్‌ని కూడా నిర్మించి.. దర్శకత్వం వహించారు.

మరోపక్క బుల్లితెర మీద సీరియల్స్ లో కూడా నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. మైనేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహలక్ష్మి, రాజేశ్వరీ కళ్యాణం, నాటకం’ ఇలా పలు సీరియల్స్ నిర్మించారు సురేష్. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న సురేష్.. రన్నర్, జనతా గ్యారేజ్, హలో గురూ ప్రేమ కోసమే, సుబ్రహ్మణ్యపురం వంటి చిత్రాల్లో నటించారు.

అయితే కెరీర్ బాగా పీక్స్ లో ఉన్న స్టేజ్ లోనే సురేష్..అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వీళ్ళు కొన్ని పర్సనల్ ప్రాబ్లంస్ వల్ల విడాలులు తీసుకున్నారు. “ఆమెను నాతో ఉంచుకుని బాధ పెట్టడం కంటే.. రెక్కలు తెంచుకుని వెళ్తేనే సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో విడాకులు ఇచ్చా తప్ప.. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. భార్యను వదులుకున్నా ప్రాణ స్నేహితురాల్ని పొందుకున్న” అని ఆయన చాలా సందర్భలో చెప్పుకొచ్చారు.

ఇక అనిత కు విడాకులు ఇచ్చిన తరువాత సురేష్ రాజేశ్వరి అనే మహిళను రెండవ పెళ్లి చేసుకున్నాడు. సురేష్ పెళ్లి చేసుకున్న రాజేశ్వరి ఒక రచయత అలాగే నిర్మాత కూడా. సురేష్ నటించే సీరియల్స్ కు రైటర్ గా పనిచేస్తారు రాజేశ్వరి. సురేష్ మొదటి భార్య అనిత తో విడాకులు తీసుకున్నాగాని ఇప్పటికీ వీరు స్నేహంగా ఉంటారు. ఇతని నుండి విడిపోయిన తర్వాత ఆమె మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news