Gossipsఆ విషయంలో ప్రభాస్ ను వెనక్కి నెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..?

ఆ విషయంలో ప్రభాస్ ను వెనక్కి నెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..?

మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కార్లు అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త మోడల్స్‌ను కొనడం యంగ్ టైగర్‌కు మక్కువ. మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకుంటారు ఎన్టీఆర్. ఈయన దగ్గర కార్స్ కలెక్షన్స్ చాలానే ఉంది. ఎప్పుడూ ఒకే కారులో తిరగడం యంగ్ టైగర్‌కు అస్సలు నచ్చదు. అందుకే ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను బట్టి కార్లు మారుస్తూనే ఉంటాడు ఈయన. అయితే కొంతకాలంగా కార్ మార్చని ఎన్టీఆర్.. ఇప్పుడు మాత్రం అదిరిపోయే కొత్త కార్ తీసుకున్నాడట.

హైదరాబాద్‌కి చెందిన ఓ ఇంపోర్టెడ్ కార్ డీలర్ ద్వారా సుమారు ఐదు కోట్లు వెచ్చించి మరీ ళంబొర్ఘిని ఊరుస్ చర్ ని కొన్నట్టు టాక్. ఇలాంటి కారు హైదరాబాద్‌లో ఎవరికీ లేదట. అందుకే యంగ్ టైగర్ ఈ కారుపై కన్నేసి మరి కొనుకున్నట్లు ఫిలింనగర్ టాక్. ఆ మధ్య ప్రభాస్ కూడా లంబోర్గి కారును కొని దానితో ముంబై వీధుల్లో చక్కర్లు కూడా కొట్టాడు .

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా 5 కోట్ల ఖరీదైన లంబోర్గి కారును కొనుగోలు చేసినట్లు , ఆ కార్ ఫస్ట్ రైడ్ రామ్ చరణ్ ఇంటికి తీసుకెళ్లాడని అంటున్నారు. ఈ మేరకు రామ్ చరణ్ ఇంటి ముందు ఉన్న ఒక లగ్జరీ కార్ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ మూవీ చేస్తుండగా.. ఇది పూర్తి కాగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస రావు దర్శకత్వంలో కొత్త సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఓవైపు ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను హోస్ట్ చేసేందుకు రెడి అయ్యాడు మన యంగ్ టైగర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news