Moviesద‌ర్శ‌కుల‌ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్లు వీళ్లే..

ద‌ర్శ‌కుల‌ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్లు వీళ్లే..

సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు కొంద‌రు ద‌ర్శ‌కుల‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ లిస్టు చాలానే ఉంది. వీరి గురించి చూస్తే…

కృష్ణవంశీ, రమ్యకృష్ణ : పెళ్ళికి ముందు రమ్యకృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో చంద్ర‌లేఖ సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య ప్రేమ పెళ్లికి దారితీసింది.

 

సెల్వమణి, రోజా : రోజా సినిమా కెరీర్ ఆరంభంలోనే ఓ త‌మిళ సినిమాలో న‌టిస్తోన్న క్ర‌మంలో సెల్వ‌మ‌ణిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయ్యి… ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు.

 

మణిరత్నం, సుహాసిని : టాలీవుడ్‌లో నిన్న‌టి త‌రం సంప్ర‌దాయ హీరోయిన్ సుహాసిని – క్రేజీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంను ప్రేమించి పెళ్లాడారు. ఈ దంప‌తుల‌కు ఒక కుమారుడు.

 

సూర్యకిరణ్, కళ్యాణి : కేరళలో పుట్టి చెన్నైలో సెటిల్ అయిన డైరక్టర్ సూర్యకిరణ్ తెలుగులో సుమంత్ హీరోగా వ‌చ్చిన స‌త్యం సినిమాతో డైరెక్ట‌ర్ అయ్యాడు. పెద‌బాబు షూటింగ్ లొకేష‌న్లో వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. వీరు మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిపోయారు. అయినా ఒక‌రి అభిప్రాయాలు మ‌రొక‌రు గౌర‌వించుకుంటూనే ఉంటారు.

 

సుందర్, కుష్బూ : హీరోయిన్ ఖుష్బూ, కోలీవుడ్ డైరెక్ట‌ర్ సి. సుంద‌ర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె తమిళ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. ఆమె ఇటీవ‌లే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేశారు.

 

భాగ్యరాజ్, పూర్ణిమ : నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్‌కు ముందు ప్ర‌వీణతో పెళ్ల‌య్యింది. ఆమె చ‌నిపోవ‌డంతో ఆ త‌ర్వాత ఓ సినిమా షూటింగ్ టైంలో పూర్ణిమ‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం నేప‌థ్యంలో ఆమెను పెళ్లాడారు.

 

సురేష్ మీనన్, రేవతి : ద‌ర్శ‌కుడు సురేష్ మీనన్, కేరళ నటి రేవతి 1986 లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. 16 ఏళ్ల దాంప‌త్య జీవితం త‌ర్వాత వీరు విడాకులు తీసుకున్నారు.

 

సెల్వ రాఘవన్, సోనియా అగర్వాల్ : 7 /జి బృందావన్ కాలనీని షూటింగ్ టైంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత రెండేళ్ల‌కే వీరు విడాకులు తీసుకున్నారు. సెల్వ రాఘ‌వ‌న్ మ‌రో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు.

 

విజయ్, అమలాపాల్ : నాన్న సినిమా షూటింగ్ టైంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల సంసారం త‌ర్వాత 2016లో విడాకులు తీసుకున్నారు.

జీవిత, రాజ‌శేఖ‌ర్‌:  వీరిద్ద‌రు న‌టుడు.. జీవిత డైరెక్ట‌ర్ కూడా.. అంకుశం సినిమా టైంలో ఏర్ప‌డిన ప‌రియంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news