Moviesప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్ అయ్యి ప‌త్తా లేదు.. ఆ ఫేడ‌వుట్ పాప...

ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్ అయ్యి ప‌త్తా లేదు.. ఆ ఫేడ‌వుట్ పాప చివ‌ర‌కు ఆ ప‌ని…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న ఎవ‌రైనా హీరోయిన్‌గా చేస్తే త‌మ ద‌శ మారిపోతుంద‌ని అనుకుంటారు. ప‌వ‌న్ ప‌క్క‌న చేసిన హీరోయిన్ల‌లో కొంద‌రు నిజంగానే స్టార్లు అయిపోయారు. మ‌రి కొంద‌రు మాత్రం ప‌వ‌న్ సినిమాల‌తోనే హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయినా అవి ప్లాప్ కావ‌డంతో ప‌త్తా లేకుండా పోయారు. కొమ‌రం పులి సినిమాతో హీరోయిన్ అయిన నికీషా ప‌టేల్ ఆ సినిమా త‌ర్వాత ఒక‌టి రెండు సినిమాలు చేసి అడ్ర‌స్ లేకుండా పోయింది. పంజా సినిమా హీరోయిన్లు పేర్లు కూడా త‌ర్వాత ఎవ్వ‌రికి గుర్తు లేవు.

 

ఇక 2010లో ఎస్‌.జె. సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ఏ.ఆర్ రెహ్మ‌న్ సంగీత సార‌థ్యంలో వ‌చ్చిన కొమ‌రం పులి ( పులి) సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన నికిషా ప‌టేల్ న‌ట‌న చూసి ప‌వ‌న్ ఫ్యాన్స్ బుర్ర‌లు బాదుకున్నారు. ఈ అమ్మాయి ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్ ఏంట్రా బాబు అనుకున్నారు. చివ‌ర‌కు ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె పూరి సోద‌రుడు సాయిరాం ప‌క్క‌న‌, క‌ళ్యాణ్‌రామ్ ప‌క్క‌న క‌త్తి సినిమాలు చేసినా ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.

 

చివ‌ర‌కు ఆమె త‌న స్వ‌స్థ‌లం అయిన లండ‌న్ వెళ్లిపోయి అక్క‌డ ఓ ఛానెల్లో యాంక‌ర్‌గా చేయ‌డంతో పాటు హాలీవుడ్ సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేస్తోంది. నికిషాకు తెలుగులో ప‌వ‌న్‌, క‌ళ్యాణ్‌రామ్ ప‌క్క‌న మంచి ఛాన్సులు వ‌చ్చినా ఆమె న‌ట‌న‌లో పూర్ కావ‌డంతో ఇక్క‌డ ప్రేక్ష‌కులు, ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిలో ప‌డ‌లేక‌పోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news