Moviesసునీల్ హీరోయిన్ ఇప్పుడు ఎక్క‌డ ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..!

సునీల్ హీరోయిన్ ఇప్పుడు ఎక్క‌డ ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..!

టాలీవుడ్ ఓ మ‌హాస‌ముద్రం ఎంతో మంది హీరోయిన్లు వ‌స్తుంటారు… వెళుతుంటారు. వీరిలో కొంద‌రు మాత్ర‌మే ఎక్కువ రోజులు నిల‌దొక్కుకుంటారు. సూర్య‌కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ హీరోగా వ‌చ్చిన ధ‌న 51 సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది స‌లోనీ. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో 20కు పైగా సినిమాల్లో న‌టించిన సలోనీ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ హీరోగా వ‌చ్చిన మ‌ర్యాద రామ‌న్న సినిమాలో న‌టించింది.

 

ఆ త‌ర్వాత ఆమెకు హీరోయిన్‌గా ఎందుకో గాని బ్రేక్ రాలేదు. విక్ట‌రీ వెంకటేష్ ప‌క్క‌న బాడీగార్డ్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన స‌లోనీ ఆ త‌ర్వాత సినిమాల్లో క‌నిపించ‌లేదు. ఇక బ‌రువు పెరిగిపోవ‌డం, లుక్ పూర్తిగా మారిపోవ‌డంతో ఆమెకు హీరోయిన్‌గా ఛాన్సులు ఇచ్చేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాలేదు.

 

ఇక క‌థల ఎంపిక‌లో కూడా స‌లోని స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం కూడా ఆమె కెరీర్‌కు పెద్ద మైన‌స్ అయ్యింది. ఇక సినిమా ఛాన్సులు రాక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఆమె ముంబైలో నివాసం ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news