Moviesఆ హీరోయిన్‌తో రాస‌లీలలు‌... స‌మీర్‌ను బుక్ చేసేసిందా...!

ఆ హీరోయిన్‌తో రాస‌లీలలు‌… స‌మీర్‌ను బుక్ చేసేసిందా…!

సినిమాల్లో క్యారెక్ట‌ర్ వేషాలు వేసుకునే స‌మీర్ గ‌తంలో ప‌లు సీరియ‌ల్స్‌లో టాప్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. రాజ‌మౌళి శాంతినివాసం సినిమాలో స‌మీర్ చేసిన రోల్ ఇప్ప‌ట‌కీ తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లో అలాగే ఉంది. ఆ త‌ర్వాత కొన్ని సీరియ‌ల్స్‌లో చేసిన స‌మీర్ సినిమాల్లోకి వ‌చ్చాక ఎన్నో మంచి క్యారెక్ట‌ర్లు చేశాడు. ఆ త‌ర్వాత తెలుగు బిగ్‌బాస్ ఒక‌టో సీజ‌న్లోనూ క‌నిపించాడు. స‌మీర్‌కు సీరియ‌ల్స్‌లో న‌టించే స‌మ‌యంలో ఓ ఘోర‌మైన అనుభ‌వం ఎదురైంద‌ట‌.

నా మొగుడు నాకే సొంతం అనే సీరియ‌ల్లో స‌మీర్ హీరోగా ఎంపిక‌య్యాడు. అది స‌మీర్‌కు మంచి బ్రేక్ లాంటిది. అయితే ఈ సీరియ‌ల్ షూటింగ్ జ‌రుగుతుండ‌గా బ్రేక్ టైంలో హీరోయిన్‌తో రాస‌లీల‌లు జ‌రిపిన‌ట్టు కొంద‌రు ఆరోపించార‌ట‌. తాను అలా చేయ‌లేద‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసినా కూడా విన‌కుండా స‌మీర్‌ను ఆ సీరియ‌ల్ నుంచి తొల‌గించేశార‌ట‌. త‌న‌ను అపార్థం చేసుకుని త‌ప్పించార‌ని స‌మీర్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

అయితే వాళ్లు అలా తీసేయ‌డంతోనే త‌న‌కు మంచి అయ్యింద‌ని.. ఆ త‌ర్వాత తాను టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని వంద‌ల సినిమాల్లో న‌టించాన‌ని స‌మీర్ చెప్పాడు. ఇక ఇప్పుడు పోలీస్ ఆఫీస‌ర్ రోల్ అయినా, అన్న‌, త‌మ్ముడు ఇలా ఏ రోల్ చేయాల‌న్నా స‌మీరే గుర్తుకు వ‌స్తాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news