Gossipsక్రేజీ యంగ్ హీరోతో ప్రియా వారియ‌ర్ రొమాన్స్‌... వామ్మో కేక పెట్టించేస్తోందిగా...!

క్రేజీ యంగ్ హీరోతో ప్రియా వారియ‌ర్ రొమాన్స్‌… వామ్మో కేక పెట్టించేస్తోందిగా…!

కోలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. తొలి సినిమా ఆదిత్య‌వ‌ర్మ ( అర్జున్‌రెడ్డి) రీమేక్‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన ధృవ్ ఇప్పుడు రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు మురుగ‌దాస్ వ‌ద్ద సుదీర్ఘ‌కాలంగా అసిస్టెంట్‌గా ప‌నిచేసిన ర‌వికాంత్ ద‌ర్శ‌కుడు.ఇక ఈ సినిమాలో ఓ క్రేజీ హీరోయిన్ ధృవ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతోంద‌ట‌.

Priya Prakash Varrier to romance Dhruv

ఆమె ఎవ‌రో కాదు సోష‌ల్ మీడియాలో చిన్న‌గా క‌న్నుగీటి దేశ‌వ్యాప్తంగా ఉన్న కుర్రాళ్లంద‌రిని ఒకే ఒక్క వీడియోతో త‌న వైపున‌కు తిప్పుకున్న వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె ధృవ్ ప‌క్క‌న హీరోయిన్‌గా ఎంపిక చేశారని సమాచారం అందుతోంది. ఒక్క సినిమాలో రెండు షాట్ల‌తో ఆల్ ఇండియా స్టార్ డ‌మ్ తెచ్చుకున్న ప్రియా ప్రకాష్ వారియ‌ర్ రెండో సినిమా శ్రీదేవి బంగ్లాలో న‌టించినా అది ఇంకా రిలీజ్ కాలేదు.

LEAKED Video! Priya Prakash Varrier locks lips with Roshan - tollywood

కొద్ది రోజుల క్రితం ఆమె పేరు తెలుగులో నితిన్ ప‌క్క‌న వినిపించింది. ఇక ఇప్పుడు ధృవ్ ప‌క్క‌న ఛాన్స్ అంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి. ఇద్ద‌రు లేత వ‌య‌స్సులో ఉండ‌డంతో కాంబినేష‌న్ ఇర‌గ‌దీస్తుంద‌ని.. ప్రియ ఈ సారి త‌న న‌ట‌న ఫ్రూవ్ చేసుకుంటే ఆమె సౌత్ ఇండియానే కేక పెట్టించేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news