Moviesజ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతిపై జ‌గ‌న్‌, చంద్ర‌బాబు ఏం అన్నారంటే..

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతిపై జ‌గ‌న్‌, చంద్ర‌బాబు ఏం అన్నారంటే..

టాలీవుడ్ సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌రెడ్డి ఇవాళ ఉదయం గుంటూరులో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి ప‌ట్ల త‌న సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌న ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. సినిమా ఇండ‌స్ట్రీలో ఆయ‌న త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నార‌ని కొనియాడారు.

ఇక మ‌జీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న త‌న‌యుడు నారా లోకేశ్ కూడా జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయ‌న నాట‌క‌, తెలుగు చ‌లన‌చిత్ర రంగానికి ఎంతో సేవ చేశార‌ని బాబు కొనియాడారు. ఇక భాష్యం విద్యాసంస్థ‌ల అధినేత రామ‌కృష్ణ త‌న‌ సంతాపం వ్యక్తం చేశారు. సహృదయుడు, గణిత ఉపాధ్యాయుడు, విలక్షణ నటుడిగా జయప్రకాశ్‌రెడ్డి మంచి గుర్తింపు పొందారని కొనియాడారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news