Moviesబిగ్‌బాస్‌కు ఐపీఎల్ దెబ్బ త‌ప్ప‌దా.. రేటింగ్ ఢ‌మాలే...!

బిగ్‌బాస్‌కు ఐపీఎల్ దెబ్బ త‌ప్ప‌దా.. రేటింగ్ ఢ‌మాలే…!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ ప్ర‌భావం ప‌డ‌లేదు. బిగ్‌బాస్‌, ఐపీఎల్ ఎప్పుడూ ఒకేసారి రాలేదు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా బిగ్‌బాస్‌, ఐపీఎల్ ఒకేసారి రావ‌డంతో బిగ్‌బాస్ రేటింగ్‌పై ఐపీఎల్ ప్ర‌భావం ప‌డ‌నుంది. బిగ్‌భాస్ 4 సెప్టెంబ‌ర్ 6న ప్రారంభ‌మైంది. ఇది ఏకంగా 105 రోజుల పాటు ఉంటుంది. ఇక ఐపీఎల్ ఈ నెల 19 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఈ రెండూ ఎంటెర్‌టైన్‌మెంట్‌ షోలు ఒకే స‌మ‌యంలో ఉండ‌డంతో బిగ్‌బాస్ వ్యూవ‌ర్ షిఫ్‌కు ఖ‌చ్చితంగా దెబ్బ ప‌డుతుంద‌న్న విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రెండిట్లో బిగ్‌బాస్ 9.30 గంట‌ల నుంచి 10.30 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. ఇక ఐపీఎల్లో రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంది. ఈ మ్యాచ్‌, బిగ్‌బాస్ షో టైమింగ్స్ ఒక్క‌టే. కావాలంటే బిగ్‌బాస్‌ను త‌ర్వాత ఏ హాట్‌స్టార్‌లోనో లేదా మ‌రుస‌టి టెలీకాస్ట్ అయిన‌ప్పుడో చూడ‌వ‌చ్చ‌ని భావించే వారు అప్పుడు లైవ్‌లో వ‌చ్చే ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకే ప్ర‌యార్టీ ఇస్తారు. అందుకే బిగ్‌బాస్ రేటింగ్‌పై ఐపీఎల్ తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news