Newsఅన్‌లాక్ 4.0: హైద‌రాబాద్‌లో మెట్రో రైల్ రీ ఓపెన్‌... రూల్స్ ఇవే

అన్‌లాక్ 4.0: హైద‌రాబాద్‌లో మెట్రో రైల్ రీ ఓపెన్‌… రూల్స్ ఇవే

అన్‌లాక్ 4.0లో భాగంగా హైద‌రాబాద్ మెట్రోరైల్‌ను రీ ఓపెన్ చేయ‌నున్నారు. క‌రోనా కార‌ణంగా గ‌త మూడు నెల‌లుగా మెట్రో రైల్‌ను మూసేశారు. ఇక ఇప్పుడు అన్‌లాక్ 4కు అనుగుణంగా ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో స‌ర్వీసులు పునః ప్రారంభం కానున్నాయి. ఇక ఈ మెట్రో రీ ఓపెన్ రూల్స్ ఎండీ ఎన్‌వీ ఎస్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ నిబంధ‌న‌లు ఇలా ఉన్నాయి.

– ప్ర‌తి ఒక్క‌రు భౌతిక దూరం పాటించాలి.. మార్కింగ్‌కు త‌గినట్టుగా ప్ర‌యాణికులు ఫాలో అవ్వాలి. నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తారు. ఇక  నగదు రహిత రూపంలో  ఆన్ లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక  ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇక ఫేస్ మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా వాడాలి.. లేనిప‌క్షంలో వారు స్టేష‌న్‌లో మాస్క్ కొనుక్కున్నాకే లోప‌ల‌కు అనుమ‌తి ఉంటుంది.

ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేసి నార్మ‌ల్ టెంప‌రేచ‌ర్ ఉంటేనే అనుమ‌తి ఇస్తారు. ఇక హ్యండ్ శానిటైజ‌ర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇక 75 శాతం ఫ్రెష్ ఎయిర్ ట్రైన్‌లో అందుబాటులో ఉంటుంది. ప్ర‌తి స్టేష‌న్లో ఐసోలేష‌న్ రూంలు అందుబాటులో ఉంటాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news