Moviesహాస్ప‌ట‌ల్లో సంజ‌నా ర‌చ్చ ర‌చ్చ‌... న‌న్ను బ‌క‌రాను చేశారంటూ

హాస్ప‌ట‌ల్లో సంజ‌నా ర‌చ్చ ర‌చ్చ‌… న‌న్ను బ‌క‌రాను చేశారంటూ

డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ్డ క‌న్న‌డ హీరోయిన్ సంజ‌న ఆసుప‌త్రిలో ర‌చ్చ ర‌చ్చ చేశారు. డోప్ రీక్ష‌లు చేసుకోనండూ ఆమె వైద్యుల‌కు స‌హ‌క‌రించ‌లేదు స‌రిక‌దా..? నానా హంగామా చేశారు. ఆమెకు డ్రగ్‌ టెస్ట్‌ కోసం బెంగళూరులోని కేసీ సాధారణ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డోప్‌ పరీక్ష చేయించుకోనంటూ పోలీసులతో వాదనకు దిగారు. నన్నెందుకు అరెస్టు చేశారు ? మీరంతా కలిసి నన్ను బకరాను చేశారు. నేనే త‌ప్పూ చేయ‌లేదు అని కేక‌లు వేశారు.

Karnataka drug case: Bengaluru CCB raids actor Sanjana Galrani's residence

ఇక ఈ కేసు విచార‌ణ‌లో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్ప‌టికే పోలీసుల విచార‌ణ‌లో ఉన్న రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ, పృథ్వీ శెట్టితో పాటు మాదకద్రవ్యాలు స‌ర‌ఫ‌రా చేసే వీరేన్‌ ఖన్నా, రాహుల్‌ ఆస్తుల గురించి వీరు ఆరా తీశారు. వీళ్ల‌కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న‌ట్టు కూడా ఈడీ విచార‌ణ‌లో తేలింది. ఇక వీటితో పాటు ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు కేర‌ళ‌కు చెందిన గోల్డ్ స్మ‌గ్లింగ్ ముఠాతో స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌ట్టు గుర్తించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news