Moviesటీవీ న‌టి శ్రావ‌ణి మృతి కేసులో ఊహించ‌ని ట్విస్ట్‌... స‌హ‌జీవ‌నానికి ఒత్తిడి

టీవీ న‌టి శ్రావ‌ణి మృతి కేసులో ఊహించ‌ని ట్విస్ట్‌… స‌హ‌జీవ‌నానికి ఒత్తిడి

టీవీ న‌టి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసులో అనేక కొత్త కోణాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు దేవ‌రాజ్‌, సాయిపై అనేక అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. ఆత్మ‌హ‌త్య చేసుకున్న రోజు కూడా దేవ‌రాజ్‌తో శ్రావ‌ణి మాట్లాడ‌డంతో అంద‌రూ ఈ కేసులో నిందితుడు దేవ‌రాజే అనుకున్నారు. అయితే దేవ‌రాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో అనేక కీలక సాక్ష్యాలు పోలీసుల‌కు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. శ్రీ కన్య హోటల్ కి వెళ్లిన పోలీసులు సిసి ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు.

 

అక్క‌డ సాయి దేవ‌రాజ్‌పై దాడి చేయ‌డంతో పాటు శ్రావ‌ణిపై చేయి చేసుకున్న విష‌యం కూడా స్ప‌ష్టంగా ఉందంటున్నారు. అంతే కాకుండా ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్‌రెడ్డితో స‌హ‌జీవ‌నం చేయాల‌ని సాయి శ్రావ‌ణిని వేధించ‌డంతో పాటు తీవ్రంగా ఒత్తిడి చేసి.. వేధించిన‌ట్టు కూడా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌మ మాట విన‌కుండా శ్రావ‌ణికి అడ్డుగా ఉన్న దేవ‌రాజ్‌ను అడ్డు తొల‌గించుకునేందుకే సాయి ప్లాన్ చేశాడ‌ని దేవ‌రాజ్ ఆరోపిస్తున్నాడు.

 

అలాగే శ్రావణి దేవరాజ్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సాయి ఒక ఆడియో టేప్‌తో పాటు శ్రావ‌ణి త‌న‌కు ప్ర‌పోజ్ చేస్తోన్న వీడియోలు సైతం దేవ‌రాజ్ బ‌య‌ట పెట్టాడ‌ట‌. ఇక త‌న‌ను కాద‌ని శ్రావ‌ణి దేవ‌రాజ్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నందువ‌ల్లే సాయి ఆమెను విప‌రీతంగా వేధించాడ‌ని కూడా ద‌ర్యాప్తులో తేలింద‌ట‌. ఈ కేసులో కీలకంగా ఉన్న సాయి.. నిర్మాత అశోక్ రెడ్డి ని కూడా విచారిస్తే అసలు సూత్రధారులు ఎవరన్నది తేలనుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news