Movies27 ఏళ్ల త‌ర్వాత బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్‌... !

27 ఏళ్ల త‌ర్వాత బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్‌… !

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు శంకర్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ అప్ప‌ట్లో భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు కేరాఫ్ అయిన కేటి.కుంజుమోహ‌న్ నిర్మించిన సినిమా జెంటిల్‌మేన్‌. 1993లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత సూప‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఏఆర్‌. రెహ్మ‌న్ మ్యూజిక్‌, శంక‌ర్ టేకింగ్ సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక రెహ్మ‌న్ బాణీలు దేశ‌వ్యాప్తంగా శ్రోత‌ల‌ను అల‌రించాయి. తెలుగు , తమిళ భాష‌ల్లో ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది.

Gentleman - Gentleman Film KTK

ఈ సినిమా రిలీజ్ అయిన 27 ఏళ్ల‌కు ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వ‌స్తోంది. ఈ విష‌యాన్ని జెంటిల్‌మేన్ నిర్మాత కుంజుమోహ‌న్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెంటిల్‌మేన్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ అయ్యింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ సినిమాకు రెండింత‌లు గొప్ప‌గా జెంటిల్‌మేన్ 2 సినిమాను తెర‌కెక్కిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

I Listened 'Gentleman' Story To Say 'No': Arjun | Tupaki English

హాలీవుడ్ టెక్నాల‌జీతో తాము జెంటిల్‌మేన్ 2ను రూపొందిస్తున్నామ‌ని చెప్పారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జెంటిల్‌మేన్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామ‌ని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news