Gossipsబిగ్‌బాస్ హౌస్‌లో క‌ట్ట‌ప్ప ఎవ‌రో తెలిసిపోయింది..

బిగ్‌బాస్ హౌస్‌లో క‌ట్ట‌ప్ప ఎవ‌రో తెలిసిపోయింది..

బిగ్‌బాస్ షో తొలి రెండు రోజుల‌తో పోలిస్తే ఇప్పుడిప్ప‌డే కాస్త పుంజుకుంటోంది. కంటెస్టెంట్లు ఇప్పుడిప్పుడే ఒక‌రితో మ‌రొక‌రు క‌నెక్ట్ అవుతున్నారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఓ క‌ట‌ప్ప ఉన్నాడ‌ని బిగ్‌బాస్ ముందు నుంచి ఆస‌క్తి రేపుతూ వ‌స్తున్నాడు. తాజాగా బిగ్ బాస్ అరియానా, సోహైల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఇంటి సభ్యులు ఎవరిని కట్టప్ప అనుకుంటున్నారో కనుక్కోవాలని సూచించారు.

Bigg Boss Telugu 4: From host Nagarjuna's shocking remuneration to new game  format; major changes to expect in the show due to COVID-19 | The Times of  India

సోహైల్ ఆ విష‌యం ఇంటి స‌భ్యుల‌కు చెప్ప‌గా.. తాము ఇప్ప‌టికే క‌ట్ట‌ప్ప ఎవ‌రో చెప్పేశామ‌ని.. మళ్లీ చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని ఇంటి స‌భ్యులు చెప్పారు. ఇక కొంద‌రు ఇంటి స‌భ్యులు మాత్రం క‌ట్ట‌ప్ప పేరు చెప్పారు సూర్యకిరణ్, గంగవ్వ అఖిల్ పేరును, దివి, మెహబూబ్ లాస్య పేరును, నోయల్ అమ్మ రాజశేఖర్ పేరును చెప్పారు. దేవి మాత్రం ఇంట్లో కట్టప్ప లేడని చెప్పింది. మిగిలిన కంటెస్టెంట్లు మాత్రం అస‌లు ఇంట్లో క‌ట్ట‌ప్ప గురించి మాట్లాడ‌లేదు. ఇక పైన చెప్పిన పేర్ల‌లో క‌ట్ట‌ప్ప ఉన్నాడా ? లేదా ? అన్న‌ది ఈ రోజు క్లారిటీ రావొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news