Gossipsత‌ల్లి కాబోతోన్న శ్రేయ‌... ఆ కుర్ర హీరో ఆఫ‌ర్‌కు నో...!

త‌ల్లి కాబోతోన్న శ్రేయ‌… ఆ కుర్ర హీరో ఆఫ‌ర్‌కు నో…!

తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ద‌శాబ్ద కాలానికి పైగా కెరీర్ కొన‌సాగించింది శ్రేయ‌. ఇక పెళ్ల‌య్యాక శ్రేయ కెరిర్ క్ర‌మంగా డౌన్ అవుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఆమెకు ఛాన్సులు లేక‌పోయినా చిరంజీవి, బాల‌య్య లాంటి సీనియ‌ర్ హీరోల‌కు మాత్రం మంచి ఆప్ష‌న్‌గానే ఉంది. పెళ్లి త‌ర్వాత కూడా ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా ఉప‌యోగించుకుంటోన్న శ్రేయ తాజాగా వ‌చ్చిన ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ను కాద‌నుకుంది.

Shriya Says No To Andhadhun Telugu Remake

బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాదున్ లో టబు పోషించిన పాత్ర‌ను తెలుగులో చేయాల‌ని ఆమెకు ఆఫ‌ర్ వెళ్లింది. నితిన్ రీమేక్ చేయ‌డంతో పాటు న‌టిస్తోన్న ఈ పాత్ర కోసం ముందుగా న‌య‌న‌తార‌ను అడిగితే ఆమె ఏకంగా రు. 3 కోట్ల‌కు పైనే అడ‌గ‌డంతో ఆమె ప్లేస్‌లో శ్రేయ‌కు మంచి ఆఫ‌ర్ ఇచ్చారు. శ్రీయ‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసినా ఆమె నో చెప్పింద‌ట‌.

A Suitable Boy's Tabu almost played a very different role - Radio Times

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆమె ఈ సినిమా చేస్తే ఆమె కెర‌ర్ కొంత కాలం కంటిన్యూ అయ్యేదే. అయితే శ్రేయ ప్రెగ్నెంట్ అని.. అందుకే ఆమె ఈ ఆఫ‌ర్‌కు నో చెప్పింద‌ని అంటున్నారు. చివ‌ర‌కు న‌య‌న్‌, శ్రేయ‌లు నో చెప్ప‌డంతో మ‌రో హీరోయిన్ కోసం ఇంకా అన్వేషణ చేయడం ఇష్టం లేని మేకర్స్ హిందీలో నటించిన టబునే ఫైనల్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news