Moviesడ్ర‌గ్స్ ఉచ్చులో సంజ‌న‌, రాగిణీ, ర‌కులే కాదు నాలుగు హీరోయిన్ కూడా......

డ్ర‌గ్స్ ఉచ్చులో సంజ‌న‌, రాగిణీ, ర‌కులే కాదు నాలుగు హీరోయిన్ కూడా… !

ఇప్ప‌డికే డ్ర‌గ్స్ ఉదంతం శాండ‌ల్‌వుడ్ ఇండ‌స్ట్రీని ఎలా కుదిపేస్తుందో ?  చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి చెందిన సంజ‌నా గ‌ల్రానీ, రాగిణి ద్వివేది పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక రియా చ‌క్ర‌వ‌ర్తి ర‌కుల్‌ప్రీత్ సింగ్ పేరు కూడా బ‌య‌ట పెట్టింద‌ని అంటున్నారు. ఇక ఈ ముగ్గురు హీరోయిన్ల పేర్లు ఇప్పుడు సౌత్లో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఇక సంజ‌న కేసులో అరెస్టు అయ్యాక త‌న‌ను ఈ కేసు నుంచి త‌ప్పించాల‌ని కొంద‌రు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల‌తో కూడా మాట్లాడినట్టు ఆమె కాల్ డేటా అధారంగా పోలీసులు గుర్తించారు.

 

 

ఇక ఈ ముగ్గురు హీరోయిన్ల‌తో పాటు మ‌రో హీరోయిన్ పేరు కూడా ఇప్పుడు డ్ర‌గ్స్ ఉదంతంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. నటి ఐంద్రితా రాయ్‌, డ్రగ్‌ పెడ్లర్‌ షేక్‌ ఫాజిల్‌ ఉన్న ఫోటో ఆదివారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో ఇప్ప‌టికే డ్ర‌గ్స్ ఉచ్చులో అరెస్టు అయిన సంజ‌న‌, రాగిణి చెంత‌కు మ‌రో హీరోయిన్ చేర‌నున్నారా ? అన్న సందేహాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఐంద్రితా మాత్రం తాను న‌టించిన ఓ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగానే క్యాసినోకు వెళ్లానని అంతకుమించి తనకు షేక్‌ ఫాజిల్‌తో స్నేహమే లేదని చెపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news