Moviesబ్రేకింగ్‌: బాలు ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్‌...

బ్రేకింగ్‌: బాలు ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్‌…

లెజెండ్రీ సింగ‌ర్ ఎస్పీ. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గ‌త కొద్ది రోజులుగా క‌రోనాతో పోరాడుతోన్న సంగ‌తి తెలిసిందే. ముందుగా బాలుకు క‌రోనా పాజిటివ్ రావ‌డం.. ఆ వెంట‌నే బాలు భార్య‌కు కూడా క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా పాజిటివ్‌తో బాలు ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆయ‌న్ను చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చేర్పించారు. అక్క‌డే ఈ నెల 5వ తేదీ నుంచి వైద్యం పొందుతోన్న బాలు ఆరోగ్య ప‌రిస్థితి ఒక్క‌సారిగా విష‌మించ‌డంతో పాటు చివ‌ర‌కు ఆయ‌న శ‌రీరం వైద్యానికి కూడా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో బాలు ఆరోగ్య ప‌రిస్థితిపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మైంది.

ఇక కొద్ది రోజులుగా బాలు క్ర‌మ‌క్ర‌మంగా కోలుకుంటున్నారు. దీనిపై బాలు కుమారుడు ఎస్పీ. చ‌ర‌ణ్ సైతం త‌మ తండ్రి శ‌రీరం వైద్యానికి స‌హ‌క‌రిస్తోంద‌ని… ఆయ‌న మీ అంద‌రి ఆశీస్సుల‌తో త్వ‌ర‌లోనే కోలుకుని క్షేమంగా వ‌స్తార‌ని కూడా చెప్పారు. ఇక తాజా అప్‌డేట్ ప్ర‌కారం బాలు ఆరోగ్యం మరింత మెరుగుపడినట్టు తెలుస్తుంది. అయితే లంగ్ ఇన్‌ఫెక్ష‌న్ మాత్రం నిన్న‌టి వ‌ర‌కు కాస్త క్రిటిక‌ల్‌గా ఉన్నా.. ఇప్పుడు అది కూడా చాలా వ‌ర‌కు మెరుగైంద‌ని తెలుస్తోంది. బాలు మ‌రో వారం రోజుల్లో పూర్తిగా కోలుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news