Moviesఆ ఇద్ద‌రితో హీరోయిన్ ఛాన్స్ కోసం రోజా వెయిటింగ్‌...!

ఆ ఇద్ద‌రితో హీరోయిన్ ఛాన్స్ కోసం రోజా వెయిటింగ్‌…!

ఓ వైపు రాజ‌కీయాల్లోనూ ఇటు బుల్లితెర మీద రోజా చేస్తోన్న హ‌డావిడి అంతా ఇంతా కాదు. బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జిగాను, బ‌తుకు జ‌ట్కా బండి ప్రాగ్రామ్ జ‌డ్జి గాను. అటు రాజ‌కీయాల్లో న‌గ‌రి ఎమ్మెల్యేగాను, ఏపీఐఐసీ చైర్మ‌న్‌గా కూడా రోజా అనేక రోల్స్ పోషిస్తున్నారు.  గ‌త ఐదారేళ్లుగా ఆమె సినిమాల‌కు పూర్తి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే ఇప్పుడు రోజాతో పాటు న‌టించిన హీరోయిన్లు చాలా మంది సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభిస్తున్నారు. కొంద‌రు అత్త పాత్రలు.. మ‌రి కొంద‌రు త‌ల్లి పాత్ర‌లు వేస్తున్నారు.

ఇక ఇప్పుడు రోజా సెకండ్ ఇన్సింగ్స్ గురించి కూడా వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇక రోజాను తిరిగి వెండితెర‌పైకి తీసుకు వ‌చ్చేందుకు చాలా మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండి తెర‌పై న‌టిస్తే లేనిపోని విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌నే ఆమె కాస్త సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా ఓ వేడుక‌లో ఆమె యాంక‌ర్ ప్ర‌శ్న‌కు స్పందిస్తూ ప్రస్తుతం తాను సినిమాలకు దూరంగా ఉన్నానని, కానీ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు.

చిరంజీవి సినిమాల వ‌ల్లే త‌న‌కు మంచి పేరు వ‌చ్చింద‌ని చెప్పిన రోజా.. ఇక చిరంజీవితో పాటు అటు నాగార్జున సినిమాలో కూడా ఛాన్స్ వ‌స్తే తాను మ‌ళ్లీ ఆన్‌స్క్రీన్ మీద క‌నిపించేందుకు ఉత్సాహంతో ఉన్నాన‌ని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news