Gossipsచిరు చేసిన ప‌నితో ప‌వ‌న్‌పై ప్రెజ‌ర్ పెరిగిపోతోందిగా... ఒక్క‌టే టెన్ష‌న్‌...!

చిరు చేసిన ప‌నితో ప‌వ‌న్‌పై ప్రెజ‌ర్ పెరిగిపోతోందిగా… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే కానుక‌గా ఆచార్య స్టిల్ వ‌దిలేశారు. ఈ మోష‌న్ లుక్ పోస్ట‌ర్‌తో ఆయ‌న అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది.. చిరు మోష‌న్ పోస్ట‌ర్ వ‌దిలి ఇప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్రెజ‌ర్ పెంచేస్తున్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులు సైతం ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ సినిమా నుంచి ఓ వీడియో రావాల‌ని కోరుకుంటున్నారు. పైగా చిరు మోష‌న్ పోస్ట‌ర్ వీడియ‌కు ధీటుగా ఈ వీడియో ఉండాల‌ని వారు కోరుకుంటున్నారు పవర్ స్టార్ అభిమానులు.

పైగా వ‌చ్చే నెల 5వ తేదీన ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌కీల్‌సాబ్ నుంచి ఓ వీడియో కూడా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌కనిర్మాత‌లు. ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక‌ ఫస్ట్ ఆడియో సింగిల్ మగువా మగువా అంటూ సాగే పాట కూడా సూపర్ హిట్ అయింది. ఇక సెప్టెంబ‌ర్ 5న ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిన్న టీజ‌ర్ వీడియో అయినా రాక‌పోతుందా ? అని ప‌వ‌న్ అభిమానులు అయితే వెయిటింగ్‌లో ఉన్నారు.

మ‌రి ప‌వ‌న్ ఎలాంటి వీడియో వ‌దులుతాడో ? త‌న అభిమానుల‌ను ఎంత వ‌ర‌కు శాటిస్‌పై చేస్తాడో ?   చూడాలి. ఇక వకీల్ సాబ్ కి సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. అయితే హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేని సినిమా కాబట్టి.. హీరోయిన్ ఎంట్రీ పార్ట్ షూటింగ్ ఇంకా కాలేదని అంటున్నారు. ఇటు ఫ్యాన్స్ మాత్రం ఒక్క వీడియో కోసం ఎంతో టెన్ష‌న్ టెన్ష‌న్‌తో వెయిటింగ్‌లో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news