Gossipsహాట్ హీరోయిన్‌... స్టార్ హీరోయిన్ మ‌ధ్య‌లో ప‌వ‌ర్‌స్టార్‌...!

హాట్ హీరోయిన్‌… స్టార్ హీరోయిన్ మ‌ధ్య‌లో ప‌వ‌ర్‌స్టార్‌…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు మరొకవైపు మంచి వైవిధ్య సినిమాల‌ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీలో కూడా నటిస్తున్నారు. ఇక వ‌కీల్‌సాబ్ ఇప్ప‌టికే 70 శాతం కంప్లీట్ అయ్యింది. ఇక క్రిష్ సినిమా సైతం ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ గ‌జ‌దొంగ పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ల‌కు సంబంధించి టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఆస‌క్తిక‌ర వార్త వినిపిస్తోంది.

Wow! Jacqueline Fernandez and Pawan Kalyan to come together for a period  drama - entertainment

ఈ సినిమాలో ప‌వ‌న్ ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు న‌టించ‌నున్నారు. వీరిలో ఒక‌రు బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌. జాక్వెలైన్ కూడా ప‌వ‌న్ ప‌క్క‌న దొంగగానే క‌నిపించ‌నుంద‌ట‌. ఇక రెండో హీరోయిన్ ఎవ‌రో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవ‌డం ఖాయం. లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌ను ప‌వ‌న్ ప‌క్క‌న న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా రాలేదు. న‌య‌న్ తెలుగులో చాలా మంది స్టార్ హీరోల ప‌క్క‌న చేసినా ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించ‌లేదు.

Pawan to Romance Nayanthara?

ఇక ఇప్పుడు ప‌వ‌న్ ప‌క్క‌న న‌టిస్తే స్క్రీన్ షేక్ అయిపోవ‌డం ఖాయం. ఇక జాక్వెలైన్ లాంటి హాట్ హీరోయిన్‌, ఇటు లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార క‌లిసి న‌టిస్తే అస‌లు బాక్సాఫీస్ ర‌చ్చ ర‌చ్చే అవుతుంది. వాస్త‌వానికి ఈ సినిమాలో న‌య‌న‌తార ప్లేస్‌లో మ‌రో హీరోయిన్‌ను తీసుకోవాల‌నుకున్నా చివ‌ర‌కు న‌య‌న్ వైపు మొగ్గు చూపార‌ట‌. అయితే న‌య‌న్ ఏకంగా రు. 3 కోట్ల‌కు పైనే డిమాండ్ చేస్తోందంటున్నారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ. ఎమ్. రత్నం భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Jacqueline Fernandez roped in for Pawan Kalyan's next? | The News Minute

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news