MoviesV సినిమాలో మ‌హేష్‌బాబు - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

V సినిమాలో మ‌హేష్‌బాబు – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ హంగామా ఎక్కువ ఉండేది. ఆ త‌ర్వాత వీటికి ఫుల్‌స్టాప్ ప‌డింది. నిన్న‌టి త‌రంలో చిరంజీవి – బాల‌య్య మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తే బాగుంటుంద‌ని చాలా మంది ఊహించుకున్నారు. అది సాధ్యం కాలేదు.. అలాగే ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల‌లో పవన్-మహేష్ కాంబినేషన్ ఊహించుకునే సినీ అభిమానులు కోట్ల‌లో ఉన్నారు. ఇక సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ అయ్యే వీ సినిమా విష‌యంలో కూడా చాలా మంది ప‌వ‌న్  – మ‌హేష్ న‌టిస్తే బాగుంటుంద‌ని ముందు నుంచి అనుకున్నారు.

దీనిపై సినిమా రిలీజ్ ప్ర‌మోషన్ల‌లో ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి మాట్లాడుతూ తాను వీ క‌థ‌ను మ‌హేష్‌, ప‌వ‌న్‌ను దృష్టిలో పెట్టుకుని రాయ‌లేద‌ని.. అయితే స‌ర‌దాగా వారిద్ద‌రు క‌లిసి న‌టిస్తే బాగుంటుంద‌ని అనుకున్నామ‌ని చెప్పారు. ఇక తాను చేసిన సినిమాల్లో హీరోల‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌ల‌ను రాయ‌న‌ని.. ఓ క‌థ రాశాకే తాను హీరోల కోసం వెతుకుతాన‌ని చెప్పాడు. వీ క‌థ ముందు రాసుకున్నాక‌.. అప్పుడు నాని, సుధీర్‌బాబుతో తీయాల‌ని అనుకున్నామ‌ని చెప్పాడు. ఏదేమైనా ప‌వ‌న్‌, మ‌హేష్ క‌లిసి న‌టిస్తే ఈ సినిమా టాలీవుడ్ ద‌శ‌ను మార్చే సినిమా అవ్వ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news