Newsబిగ్ బాస్ 3 : మరో తేజస్విగా శ్రీముఖి మారబోతుందా..?

బిగ్ బాస్ 3 : మరో తేజస్విగా శ్రీముఖి మారబోతుందా..?

శ్రీముఖి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ‘పటాస్’. ఇందులో మెయిల్ యాంకర్ రవితో కలిసి రాములమ్మగా శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. గతంలో వీరిద్దరపై రక రకాల రూమర్లు వచ్చినా..వాటిని పెద్దగా పట్టించుకోకుండా ప్రోగ్రామ్ విజయవంతంగా రన్ చేశారు. ప్రస్తుతం పటాస్ 2 వస్తుంది..అయితే ఇందులో మాత్రం శ్రీముఖి లేదు. ప్రస్తుతం శ్రీముఖి బిగ్ బాస్ 3 లో కంటిస్టెంట్ గా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే మొదటి నుంచి బిగ్ బాస్ లో అల్లరి గా ఉంటూ వస్తున్న శ్రీముఖి నటి హేమ వెంట తిరుగుతూ వచ్చింది. ఆమెకు సపోర్ట్ గా శ్రీముఖి ఉంటుందన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే ప్రతి విషయంలోనూ శ్రీముఖి తనదైన మార్క్ వేసుకుంటూ కాంట్రవర్సీ చేస్తూ వస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. నిన్నటి ఎపిసోడ్ లో లగ్జరీ ఐటమ్స్ విషయంలో హేమ, సమయానికి రాకుండా ఆలస్యం చేశావని..ఆ టైమ్ కి అన్నం పెట్టుకుంటున్నావా అని అడగంతో శ్రీముఖి ఫైర్ అయ్యింది.

తాను బోజనం చేస్తే ఏంటే..నేనొచ్చిన సమయానికే టివి ఆన్ అయ్యింది..అయినా తాను ఏం చేస్తే ఏంటీ అని హేమపై ఫైర్ అయ్యింది. అలిగి వెంటనే స్మోకింగ్ రూమ్ కి వెళ్లిపోయింది. దాంతో ఆమెను కొంతమంది ఇంటి సభ్యులు బుజ్జగించి తీసుకు వచ్చారు. బిగ్ బాస్ 2 లో కూడా నటి తేజస్వి ఇలాగే అలగడం..ఫైర్ కావడం ప్రతి విషయంలోనూ కల్పించుకొని చివాట్లు తినడం జరిగింది. అప్పట్లో ఆమెపై ఎన్నో కాంట్రవర్సీలు రావడంతోనే మద్యలోనే ఎలిమినేషన్ అయ్యింది. మరి శ్రీముఖి కూడా ఇదే తరహాలో వెళితే వీక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news