Gossipsసాయి ధరం తేజ్ ఫ్లాప్ సినిమా రికార్డ్.. షాక్ లో మెగా...

సాయి ధరం తేజ్ ఫ్లాప్ సినిమా రికార్డ్.. షాక్ లో మెగా ఫ్యామిలీ..!

మెగా హీరోలంతా ఓ పక్క సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తుంటే మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ మాత్రం కెరియర్ రిస్క్ లో పడేసుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు చవిచూసిన తేజూ రీసెంట్ మూవీ తేజ్ ఐలవ్యూ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కరుణాకరణ్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై డిజాస్టర్ అనిపించుకున్న ఈ సినిమా ఆన్ లైన్ లో రికార్డులు సృష్టిస్తుంది. అదెలా అంటే యూట్యూబ్ లో హింది వర్షన్ అప్లోడ్ చేసిన ఒక్క రోజులోనే రికార్డ్ వ్యూస్ వచ్చాయట.

తేజ్ ఐలవ్యూ సినిమా హింది డబ్బింగ్ వర్షన్ సుప్రీం ఖిలాడి అంటూ అప్లోడ్ చేశారు. ఒక్కరోజులో 78 లక్షల వ్యూస్ రాగా ఇప్పటివరకు ఆ సినిమాకు 95 లక్షల దాకా వ్యూస్ వచ్చాయట. కోటి వ్యూస్ అది కూడా అతి తక్కువ టైంలో సాయి ధరం తేజ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై హిట్ కొట్టకున్నా సాయి ధరం తేజ్ యూట్యూబ్ లో మాత్రం సంచలనం సృష్టిస్తుంది. మెగా హీరోల హింది డబ్బింగ్ సినిమాల రికార్డులు ఎవరు టచ్ చేయలేని విధంగా ఉంటాయి.

సరైనోడు సినిమా హింది డబ్బింగ్ వర్షన్ సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. లేటెస్ట్ గా తేజ్ ఐలవ్యూ కూడా అదే తరహాలో యూట్యూబ్ లో పెట్టిన అతి తక్కువ టైంలో కోటి వ్యూస్ తో అదరగొట్టింది. డిజాస్టర్ మూవీకి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కె.ఎస్ రవికుమార్ నిర్మించిన ఈ సినిమాలో సాయి ధరం తేజ్ తరపున అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news